చిట్టకీనివలెఁ దాను చిన్న చేఁతలెల్లాఁ జేసీ
(॥పల్లవి॥)
చిట్టకీనివలెఁ దాను చిన్న చేఁతలెల్లాఁ జేసీ
యెట్టు దెలియఁగవచ్చు నెఱఁగనే నేను
(॥చిట్ట॥)
కప్పుర మిచ్చేనంటా కందువకుఁ జేయి చూపి
తప్పించి కండచక్కెరలప్ప వెట్టెను
విప్పక నిజమనుచు విడెములో వేసుకొంటిఁ
గప్పి తములము తీపుగాఁగా నుమిసితినే
(॥చిట్ట॥)
ఇదె నూరినకస్తూరి ఇచ్చేనంటా ముందు చూపి
మెదిగిన మరియము మేని కిచ్చేనే
వుదుటున నౌనంటా వొడల నేఁ బూసుకొంటి
సదరాన వెట్టగాఁగా జలక మాడితినే
(॥చిట్ట॥)
విరుల పాన్పిచ్చేనంటా వెసఁ బెద్దరాశి వోసి
యెరవులేకుండాఁ దాను టు దాఁగెనే
పరగఁగా నిమ్మనుచుఁ బవ్వళించితే నందు
తరి శ్రీవేంకటేశుఁడు తాఁ గూడె మొక్కితినే
(||pallavi||)
siṭṭagīnivalĕm̐ dānu sinna sem̐talĕllām̐ jesī
yĕṭṭu dĕliyam̐gavachchu nĕṟam̐gane nenu
(||siṭṭa||)
kappura michchenaṁṭā kaṁduvagum̐ jeyi sūbi
tappiṁchi kaṁḍasakkĕralappa vĕṭṭĕnu
vippaga nijamanusu viḍĕmulo vesugŏṁṭim̐
gappi tamulamu tībugām̐gā numisidine
(||siṭṭa||)
idĕ nūrinagastūri ichchenaṁṭā muṁdu sūbi
mĕdigina mariyamu meni kichchene
vuduḍuna naunaṁṭā vŏḍala nem̐ būsugŏṁṭi
sadarāna vĕṭṭagām̐gā jalaga māḍidine
(||siṭṭa||)
virula pānpichchenaṁṭā vĕsam̐ bĕddarāśhi vosi
yĕravuleguṁḍām̐ dānu ṭu dām̐gĕne
paragam̐gā nimmanusum̐ bavvaḽiṁchide naṁdu
tari śhrīveṁkaḍeśhum̐ḍu tām̐ gūḍĕ mŏkkidine