చిట్టకపు చెంత(చేఁత)లకు చెందేదేమి
(॥పల్లవి॥)
చిట్టకపు చెంత(చేఁత)లకు చెందేదేమి
పెట్టినాఁ డుంకువ తొల్లె పెండ్లాడుమనవే
(॥చిట్ట॥)
వాసులు రేఁచీ నాకు వనితలఁ జూపిచూపి
ఆసలు వుట్చించీని ఆయములంటి
యేసుద్దులు నేమిటికి యింతగలవాఁడైతే
బేసబెల్లి తనమేల పెండ్లాడుమనవే
(॥చిట్ట॥)
మనసు గరఁగించీని మాట లూరకే యాడి
ననుపుగాఁ దమిరేఁచీ నవ్వులు నవ్వి
పనిలేనిజాగులు పచారించనేమిటికి
పెనఁగేనా తనతోను పెండ్లాడుమనవే
(॥చిట్ట॥)
మెలుపునఁ గాఁగిలించీ మేనవావి సేసుకొని
వెలయించీఁ బులకలు వింతచేఁతల
అలమేల్‌మంగ నేను తానైతే శ్రీవేంకటేశుఁడు
పిలుపులు సమకూరెఁ బెండ్లాడుమనవే
(||pallavi||)
siṭṭagabu sĕṁta(sem̐ta)lagu sĕṁdedemi
pĕṭṭinām̐ ḍuṁkuva tŏllĕ pĕṁḍlāḍumanave
(||siṭṭa||)
vāsulu rem̐sī nāgu vanidalam̐ jūbisūbi
āsalu vuṭchiṁchīni āyamulaṁṭi
yesuddulu nemiḍigi yiṁtagalavām̐ḍaide
besabĕlli tanamela pĕṁḍlāḍumanave
(||siṭṭa||)
manasu garam̐giṁchīni māḍa lūrage yāḍi
nanubugām̐ damirem̐sī navvulu navvi
panilenijāgulu pasāriṁchanemiḍigi
pĕnam̐genā tanadonu pĕṁḍlāḍumanave
(||siṭṭa||)
mĕlubunam̐ gām̐giliṁchī menavāvi sesugŏni
vĕlayiṁchīm̐ bulagalu viṁtasem̐tala
alamelmaṁga nenu tānaide śhrīveṁkaḍeśhum̐ḍu
pilubulu samagūrĕm̐ bĕṁḍlāḍumanave