చిత్తడి చెమటమేని శ్రీనివాసా! కడు
(॥పల్లవి॥)
చిత్తడి చెమటమేని శ్రీనివాసా! కడు-
చిత్తడివాఁడవుగ దో శ్రీనివాస
(॥చిత్త॥)
చెల్లు నీకు నీచేఁతలు శ్రీనివాస! నా
చెల్లెలితో నవ్వితివి శ్రీనివాస
చెల్లఁబో యింతదొరవు శ్రీనివాస! నీ
చిల్లర విద్యలు బెట్టు శ్రీనివాస
(॥చిత్త॥)
చేరితిమి నీవద్ద శ్రీనివాస! మేను
జీరలాయ నింతలోనె శ్రీనివాస
చీరఁగారీ మా వయసు శ్రీనివాస! నీకుఁ
జేరువగా మా యిల్లు శ్రీనివాస
(॥చిత్త॥)
చిక్కని మాట లాడేవు శ్రీనివాస! మా
చిక్కెల్లా బాసెను నేఁడు శ్రీనివాస
చెక్కు నొక్కి కూడితివి శ్రీనివాస! వావి
చిక్కె శ్రీ వేంకటగిరి శ్రీనివాసా
(||pallavi||)
sittaḍi sĕmaḍameni śhrīnivāsā! kaḍu-
sittaḍivām̐ḍavuga do śhrīnivāsa
(||sitta||)
sĕllu nīgu nīsem̐talu śhrīnivāsa! nā
sĕllĕlido navvidivi śhrīnivāsa
sĕllam̐bo yiṁtadŏravu śhrīnivāsa! nī
sillara vidyalu bĕṭṭu śhrīnivāsa
(||sitta||)
seridimi nīvadda śhrīnivāsa! menu
jīralāya niṁtalonĕ śhrīnivāsa
sīram̐gārī mā vayasu śhrīnivāsa! nīgum̐
jeruvagā mā yillu śhrīnivāsa
(||sitta||)
sikkani māḍa lāḍevu śhrīnivāsa! mā
sikkĕllā bāsĕnu nem̐ḍu śhrīnivāsa
sĕkku nŏkki kūḍidivi śhrīnivāsa! vāvi
sikkĕ śhrī veṁkaḍagiri śhrīnivāsā