Sittaanam galamgagumee seppidi mippude neegu

చిత్తానఁ గలఁగకుమీ చెప్పితి మిప్పుడే నీకు
Language

(॥పల్లవి॥)
చిత్తానఁ గలఁగకుమీ చెప్పితి మిప్పుడే నీకు
పొత్తులవారము సుమీ పొలఁతికి నీకును

(॥॥)
చెలికత్తెలకునైనా చెలువుని దూరవచ్చు
బలిమి నాయకురాలిఁ బాసి వుండితే
తెలిపి బుద్దులు చెప్పే తీరుకునుఁ దేవచ్చు
వలచిన దానికి వసగా కుండితేను

(॥॥)
పొరుగు వారికి నైనా పొందులు సేయఁగవచ్చు
పురుషుఁడు కాంత నేఁ పులఁ బెట్టి తే
సరుసకుఁ దోడి తెచ్చి సమ కూరుచనూ వచ్చు
సిరుల నవ్వలి మోమై సిగ్గువడితేను

(॥॥)
దండనున్నవారికై నాఁ దగవులు చెప్పవచ్చు
కొండవంటి నీ వాపెఁ గూడ కుండితే
నిండుక శ్రీ వేంకటేశ నేఁడింతి నేలితి విట్టే
మెండుగా నవ్వఁగవచ్చు మీరిట్లా నుంటేను

(||pallavi||)
sittānam̐ galam̐gagumī sĕppidi mippuḍe nīgu
pŏttulavāramu sumī pŏlam̐tigi nīgunu

(||||)
sĕligattĕlagunainā sĕluvuni dūravachchu
balimi nāyagurālim̐ bāsi vuṁḍide
tĕlibi buddulu sĕppe tīrugunum̐ devachchu
valasina dānigi vasagā kuṁḍidenu

(||||)
pŏrugu vārigi nainā pŏṁdulu seyam̐gavachchu
puruṣhum̐ḍu kāṁta nem̐ pulam̐ bĕṭṭi te
sarusagum̐ doḍi tĕchchi sama kūrusanū vachchu
sirula navvali momai sigguvaḍidenu

(||||)
daṁḍanunnavārigai nām̐ dagavulu sĕppavachchu
kŏṁḍavaṁṭi nī vābĕm̐ gūḍa kuṁḍide
niṁḍuga śhrī veṁkaḍeśha nem̐ḍiṁti nelidi viṭṭe
mĕṁḍugā navvam̐gavachchu mīriṭlā nuṁṭenu