చిత్తానఁ బెట్టుకుండు చెప్పితి నిప్పుడే నీకు
(॥పల్లవి॥)
చిత్తానఁ బెట్టుకుండు చెప్పితి నిప్పుడే నీకు
బత్తిగలది సతి నీపై మఱవకుమీ
(॥చిత్తా॥)
వలచి యేకామినివద్ద నీవుండినాను
తలఁపు నీమీఁదిదే తరుణికిని
మలసి యెవ్వతెతోను మాఁటలు నీవాడినాను
పిలుపు నీపే రీకెకు పెదవులమీఎదను
(॥చిత్తా॥)
యేపోలతిఁకి నీవు యెదురుకొని వుండినా
చూపులు నీమీఁదివే సుదతికిని
చేపట్టి యెందరిఁ గొల్వుసేయించుక నీవుండినా
వొపి చన్నులు మీఁదెత్తుకుండు నీకాఁగిటికి
(॥చిత్తా॥)
తాలిమి నెవ్వరిపొందు తగిలి నీవుండినాను
మేలము నీతో నలమేలుమంగకు
యేలితివి శ్రీవేంకటేశ ఇన్నిటా నీకెను
మేలుదై వున్నది నీకు మిక్కిలి నిందరిలో
(||pallavi||)
sittānam̐ bĕṭṭuguṁḍu sĕppidi nippuḍe nīgu
battigaladi sadi nībai maṟavagumī
(||sittā||)
valasi yegāminivadda nīvuṁḍinānu
talam̐pu nīmīm̐dide taruṇigini
malasi yĕvvadĕdonu mām̐ṭalu nīvāḍinānu
pilubu nībe rīgĕgu pĕdavulamīĕdanu
(||sittā||)
yeboladim̐ki nīvu yĕdurugŏni vuṁḍinā
sūbulu nīmīm̐dive sudadigini
sebaṭṭi yĕṁdarim̐ gŏlvuseyiṁchuga nīvuṁḍinā
vŏbi sannulu mīm̐dĕttuguṁḍu nīgām̐giḍigi
(||sittā||)
tālimi nĕvvaribŏṁdu tagili nīvuṁḍinānu
melamu nīdo nalamelumaṁgagu
yelidivi śhrīveṁkaḍeśha inniḍā nīgĕnu
meludai vunnadi nīgu mikkili niṁdarilo