చిత్తానఁ బెట్టుక వుండు చెలఁగి నా విన్నపము
(॥పల్లవి॥)
చిత్తానఁ బెట్టుక వుండు చెలఁగి నా విన్నపము
పొత్తు విడువఁగఁ జాల పొసఁగుదుఁ గాని
(॥చిత్తా॥)
కేరి మొక్కతెవలె వెంగెములు నిన్నాడఁజాల
ఆరితేరి యిచ్చకము లాడుదుఁ గాని
సారెసారె నప్పటిని చలము సాదించఁ జాల
చేరి నీకు నూడిగాలు సేతుఁగాని
(॥చిత్తా॥)
కడదానివలె నిన్నుఁ గాకు సేయఁగాఁ జాల
వొడికేన నవ్వుతానే వుండుదుఁ గాని
యెడనెడఁ గొసరుతా నెలయించఁగాఁ జాల
బడిబడి తమకాన బత్తిసేతుఁగాని
(॥చిత్తా॥)
కన్నెపడుచువలెను కాఁకలు సేయఁగఁ జాల
యెన్న నలమేల్మంగనై యెనతుఁ గాని
వున్నతి శ్రీవేంకటేశ వొనగూడితివి నన్ను
సన్నల నీ మోవి యిట్టే చవిగొందుఁ గాని
(||pallavi||)
sittānam̐ bĕṭṭuga vuṁḍu sĕlam̐gi nā vinnabamu
pŏttu viḍuvam̐gam̐ jāla pŏsam̐gudum̐ gāni
(||sittā||)
keri mŏkkadĕvalĕ vĕṁgĕmulu ninnāḍam̐jāla
ārideri yichchagamu lāḍudum̐ gāni
sārĕsārĕ nappaḍini salamu sādiṁcham̐ jāla
seri nīgu nūḍigālu sedum̐gāni
(||sittā||)
kaḍadānivalĕ ninnum̐ gāgu seyam̐gām̐ jāla
vŏḍigena navvudāne vuṁḍudum̐ gāni
yĕḍanĕḍam̐ gŏsarudā nĕlayiṁcham̐gām̐ jāla
baḍibaḍi tamagāna battisedum̐gāni
(||sittā||)
kannĕbaḍusuvalĕnu kām̐kalu seyam̐gam̐ jāla
yĕnna nalamelmaṁganai yĕnadum̐ gāni
vunnadi śhrīveṁkaḍeśha vŏnagūḍidivi nannu
sannala nī movi yiṭṭe savigŏṁdum̐ gāni