చిత్తానఁ బెట్టకు మీమాఁట శ్రీరమణ మరవకు
(॥పల్లవి॥)
చిత్తానఁ బెట్టకు మీమాఁట శ్రీరమణ మరవకు
హత్తి నిన్నే మెరుఁగుదు నజ్ఞాని నేను
(॥చిత్తా॥)
నెలకొని నాలోన నీవున్నాఁడవు గనక
తలఁచకున్నా నిన్నుఁ దలఁచిన వాఁడనే
యెలమి నందరి నీవే యేలినవాఁడవు గనక
కొలువకున్నా నిన్నుఁ గొలిచినవాఁడనే
(॥చిత్తా॥)
నెక్కొని ఆకసమెల్లా నీపాదమే కనక
మొక్కకున్నా నేను నీకు మొక్కినవాఁడనే
నిక్కి నానాక్షరములు నీపేరులే కనక
పెక్కులుగాఁ బిలువకున్నాఁ బిలిచినవాఁడనే
(॥చిత్తా॥)
వోజ నారుగమలాల నున్నాఁడవు గనక
పూజించకున్నా నిన్నుఁ బూజించినవాఁడనే
తేజపు శ్రీవేంకటేశ దేవ నీవే గతిగాన
సాజాన నే మఱచినా శరణన్న వాఁడనే
(||pallavi||)
sittānam̐ bĕṭṭagu mīmām̐ṭa śhrīramaṇa maravagu
hatti ninne mĕrum̐gudu najñāni nenu
(||sittā||)
nĕlagŏni nālona nīvunnām̐ḍavu ganaga
talam̐sagunnā ninnum̐ dalam̐sina vām̐ḍane
yĕlami naṁdari nīve yelinavām̐ḍavu ganaga
kŏluvagunnā ninnum̐ gŏlisinavām̐ḍane
(||sittā||)
nĕkkŏni āgasamĕllā nībādame kanaga
mŏkkagunnā nenu nīgu mŏkkinavām̐ḍane
nikki nānākṣharamulu nīberule kanaga
pĕkkulugām̐ biluvagunnām̐ bilisinavām̐ḍane
(||sittā||)
voja nārugamalāla nunnām̐ḍavu ganaga
pūjiṁchagunnā ninnum̐ būjiṁchinavām̐ḍane
tejabu śhrīveṁkaḍeśha deva nīve gadigāna
sājāna ne maṟasinā śharaṇanna vām̐ḍane