చిత్తాన నెగ్గుపట్టకు చేతులెత్తి మొక్కే మిదె
(॥పల్లవి॥)
చిత్తాన నెగ్గుపట్టకు చేతులెత్తి మొక్కే మిదె
కొత్తకొత్త వయసుల కోమలులము
(॥చిత్తా॥)
కెలతుము సొలతుము కేరడము లాడుదుము
వలపులు చల్లుదుము వనితలము
పిలుతుము పేరుకొని ప్రియములు చెప్పుదుము
సళుపుఁజూపులఁ జూచి సరసమాడుదుము
(॥చిత్తా॥)
వినయాలు సేతుము వేడుకతో నవ్వుదుము
చనవున మెరతుము జవరాండ్లము
పెనఁగుదుము పైకొని పెక్కుచేఁతలు సేతుము
మనసులు గరఁగించి మరిగింతుము
(॥చిత్తా॥)
యెప్పుడైనాఁ గూడుదుము యెంగిలిమోవి సేతుము
చెప్పుకొందుము నీపొందు చెలులము
ఇప్పుడే శ్రీవేంకటేశ యేలితి విన్నిటా మమ్ము
కుప్పలుగాఁ జొక్కించి గురుతులు నింతము
(||pallavi||)
sittāna nĕggubaṭṭagu sedulĕtti mŏkke midĕ
kŏttagŏtta vayasula komalulamu
(||sittā||)
kĕladumu sŏladumu keraḍamu lāḍudumu
valabulu salludumu vanidalamu
piludumu perugŏni priyamulu sĕppudumu
saḽubum̐jūbulam̐ jūsi sarasamāḍudumu
(||sittā||)
vinayālu sedumu veḍugado navvudumu
sanavuna mĕradumu javarāṁḍlamu
pĕnam̐gudumu paigŏni pĕkkusem̐talu sedumu
manasulu garam̐giṁchi marigiṁtumu
(||sittā||)
yĕppuḍainām̐ gūḍudumu yĕṁgilimovi sedumu
sĕppugŏṁdumu nībŏṁdu sĕlulamu
ippuḍe śhrīveṁkaḍeśha yelidi vinniḍā mammu
kuppalugām̐ jŏkkiṁchi gurudulu niṁtamu