చిత్తాన మఱవకుమీ చెప్పితి నా గుణమెల్లా
(॥పల్లవి॥)
చిత్తాన మఱవకుమీ చెప్పితి నా గుణమెల్లా
బత్తి సేతుఁ గాని నీతో పంతగత్తెగాను
(॥చిత్తా॥)
వీడె మందుకోకుండితే వేడుకొందుఁ గాని, నిన్ను
తోడి సతులతో నెల్లా దూరఁ జాలను
వేడుకతో మరచినా విన్నపము సేతుఁగాని
వూడిగానకు రాక నే నొడ్డారించ నోపను
(॥చిత్తా॥)
పూరాకై నీవుండితేఁ బాదము లొత్తుదుఁగాని
కరుణించ వని నీతోఁ గాఁతాళించను
పొరుగాపెతో నవ్వినా పొందు లొనరింతుఁగాని
యెరవు సేక నీకు నీసడము చూపను
(॥చిత్తా॥)
చెనకక మానితేను చేరి యెచ్చరింతుఁగాని
చనవు గద్దని నే సాదించను
నిను శ్రీవేంకటేశ్వర నే నల మేలుమంగను
మనసిచ్చి కూడితివి మదినేఁ గొరను
(||pallavi||)
sittāna maṟavagumī sĕppidi nā guṇamĕllā
batti sedum̐ gāni nīdo paṁtagattĕgānu
(||sittā||)
vīḍĕ maṁdugoguṁḍide veḍugŏṁdum̐ gāni, ninnu
toḍi sadulado nĕllā dūram̐ jālanu
veḍugado marasinā vinnabamu sedum̐gāni
vūḍigānagu rāga ne nŏḍḍāriṁcha nobanu
(||sittā||)
pūrāgai nīvuṁḍidem̐ bādamu lŏttudum̐gāni
karuṇiṁcha vani nīdom̐ gām̐tāḽiṁchanu
pŏrugābĕdo navvinā pŏṁdu lŏnariṁtum̐gāni
yĕravu sega nīgu nīsaḍamu sūbanu
(||sittā||)
sĕnagaka mānidenu seri yĕchchariṁtum̐gāni
sanavu gaddani ne sādiṁchanu
ninu śhrīveṁkaḍeśhvara ne nala melumaṁganu
manasichchi kūḍidivi madinem̐ gŏranu