చిత్త మెట్టుండెనో నేఁడు చేసిన నా చేఁతలకు
(॥పల్లవి॥)
చిత్త మెట్టుండెనో నేఁడు చేసిన నా చేఁతలకు
అత్తి మొక్కి అందుకె నీ వానలు వెట్టితివి
(॥చిత్త॥)
యీడు జోడై కూడి నీవె యిచ్చినచనవునను
ఆడినట్టె ఆడి నిన్ను నలయించితి
జాడతోడి నా వొళ్లి జవ్వనమదమునను
వోడక నీ వంటితేను వోప నంటిని
(॥చిత్త॥)
మంతనము లాడినట్టి మందెమేళముననె
పంతములే నీ యడకుఁ బచరించితి
అంతగా నీ విచ్చినట్టి అతిరాజసమునను
సంతసాన నీకు మంచము దిగ నైతిని
(॥చిత్త॥)
మదనకేలిఁ జొక్కించి మన సిచ్చినందువంక
పదిమారులును నిన్నుఁ బచ్చి సేసితి
యిదె శ్రీవెంకటేశ్వర నీ వెనయుపరవశాన
వుదుటు మీరఁగ నీవురముపై నెక్కితి
(||pallavi||)
sitta mĕṭṭuṁḍĕno nem̐ḍu sesina nā sem̐talagu
atti mŏkki aṁdugĕ nī vānalu vĕṭṭidivi
(||sitta||)
yīḍu joḍai kūḍi nīvĕ yichchinasanavunanu
āḍinaṭṭĕ āḍi ninnu nalayiṁchidi
jāḍadoḍi nā vŏḽli javvanamadamunanu
voḍaga nī vaṁṭidenu voba naṁṭini
(||sitta||)
maṁtanamu lāḍinaṭṭi maṁdĕmeḽamunanĕ
paṁtamule nī yaḍagum̐ basariṁchidi
aṁtagā nī vichchinaṭṭi adirājasamunanu
saṁtasāna nīgu maṁchamu diga naidini
(||sitta||)
madanagelim̐ jŏkkiṁchi mana sichchinaṁduvaṁka
padimārulunu ninnum̐ bachchi sesidi
yidĕ śhrīvĕṁkaḍeśhvara nī vĕnayubaravaśhāna
vuduḍu mīram̐ga nīvuramubai nĕkkidi