Sirim dodabai nidi shreenarasimhumdu

సిరిఁ దొడపై నిడి శ్రీనరసింహుఁడు
Language

(॥పల్లవి॥)
సిరిఁ దొడపై నిడి శ్రీనరసింహుఁడు
యిరవుగ వరములనిచ్చీని వాడే

(॥సిరిఁ॥)
ఘనమగు కోరలు కరాళవదనము
చెనకుచు గొడసెటి జిహ్వయును
నినిపుఁ గటమరలు నిటలలోచనము
నొనరఁగ గొలువై యున్నాఁడు వాఁడే

(॥సిరిఁ॥)
చటులచక్రకరంబును శార్ఙ్గరంబుసు
అటు వరదాభయహస్తములు
పటుతరయోగపు పట్టబంధమును
కటితటి జెలఁగఁగఁ గడఁగీ వాఁడే

(॥సిరిఁ॥)
పరపగు శేషుని పడగల నీడల
అరుదగు రవిచంద్రాంకముల
సిరులగద్దెపై శ్రీవేంకటేశుడు
పరిపూర్ణుఁడై పరగీ వాఁడే

(||pallavi||)
sirim̐ dŏḍabai niḍi śhrīnarasiṁhum̐ḍu
yiravuga varamulanichchīni vāḍe

(||sirim̐||)
ghanamagu koralu karāḽavadanamu
sĕnagusu gŏḍasĕḍi jihvayunu
ninibum̐ gaḍamaralu niḍalalosanamu
nŏnaram̐ga gŏluvai yunnām̐ḍu vām̐ḍe

(||sirim̐||)
saḍulasakragaraṁbunu śhārṅgaraṁbusu
aḍu varadābhayahastamulu
paḍudarayogabu paṭṭabaṁdhamunu
kaḍidaḍi jĕlam̐gam̐gam̐ gaḍam̐gī vām̐ḍe

(||sirim̐||)
parabagu śheṣhuni paḍagala nīḍala
arudagu ravisaṁdrāṁkamula
sirulagaddĕbai śhrīveṁkaḍeśhuḍu
paribūrṇum̐ḍai paragī vām̐ḍe