Sippilum denelamovi semcheda

చిప్పిలుఁ దేనెలమోవి చెంచెత
Language

(॥పల్లవి॥)
చిప్పిలుఁ దేనెలమోవి చెంచెత - కడుఁ
జెప్పరాదె నీ చెలువు చెంచెత

(॥చిప్పి॥)
చెఱకువింటి బొమలచెంచెతఁనిండెఁ
జిఱనవ్వు నీమోవిఁజెంచెత
చెఱఁగు మూయకువే చెంచెత-నీ
చిఱుతతనాలు మాని చెంచెత

(॥చిప్పి॥)
చెక్కులెల్లా జీరలాయఁ జెంచెత
చిక్కుదీయవే నెరుల చెంచెత
చిక్కని చెమటగారే చెంచెత
చెక్కుకో మొగలిరేకు చెంచెత

(॥చిప్పి॥)
శ్రీ వేంకటేశుఁడ నేఁ జెంచెత
చేవదేరఁ గూడితివి చెంచెతా
జేవురు బొట్టు నొసలి చెంచెతా
చేవల్లనుండుమా యిట్టె చెంచెతా

(||pallavi||)
sippilum̐ denĕlamovi sĕṁchĕda - kaḍum̐
jĕpparādĕ nī sĕluvu sĕṁchĕda

(||sippi||)
sĕṟaguviṁṭi bŏmalasĕṁchĕdam̐niṁḍĕm̐
jiṟanavvu nīmovim̐jĕṁchĕda
sĕṟam̐gu mūyaguve sĕṁchĕda-nī
siṟudadanālu māni sĕṁchĕda

(||sippi||)
sĕkkulĕllā jīralāyam̐ jĕṁchĕda
sikkudīyave nĕrula sĕṁchĕda
sikkani sĕmaḍagāre sĕṁchĕda
sĕkkugo mŏgaliregu sĕṁchĕda

(||sippi||)
śhrī veṁkaḍeśhum̐ḍa nem̐ jĕṁchĕda
sevaderam̐ gūḍidivi sĕṁchĕdā
jevuru bŏṭṭu nŏsali sĕṁchĕdā
sevallanuṁḍumā yiṭṭĕ sĕṁchĕdā