చిన్నవానివలె నెంత చెప్పించుకొనేవు నీవు
(॥పల్లవి॥)
చిన్నవానివలె నెంత చెప్పించుకొనేవు నీవు
యెన్నరాని రతులకు నెదురుకోవలదా
(॥చిన్న॥)
చెంతనుండే చెలి నిన్నుఁ జెనకిన చెనకులు
చింతతోడఁ దలవంచి సిగ్గువడేవు
వింతవాఁడవా నీవు వేడుకకాఁడవు తొల్లె
దొంతర వలపులకు దోసిలొగ్గవలదా
(॥చిన్న॥)
ననుపున నాతి నీతో నవ్వే నవ్వులకు
వొనరఁగ నీచేతుల నొడ్డుకొనేవు
ననుచనివాఁడవా నంటుతో దొరవు నీవు
పెనఁగే తమకానకుఁ బ్రియపడవలదా
(॥చిన్న॥)
కోమలి శ్రీవేంకటేశ కూడె నీ కూటములకు
మోము చూచి యంతలోనే మొక్కు మొక్కేవు
సామాన్యపువాఁడవా సర్వేశ్వరుఁడ విదె
గోమున నెంతవడైనాఁ గొసరఁగ వలదా
(||pallavi||)
sinnavānivalĕ nĕṁta sĕppiṁchugŏnevu nīvu
yĕnnarāni radulagu nĕdurugovaladā
(||sinna||)
sĕṁtanuṁḍe sĕli ninnum̐ jĕnagina sĕnagulu
siṁtadoḍam̐ dalavaṁchi sigguvaḍevu
viṁtavām̐ḍavā nīvu veḍugagām̐ḍavu tŏllĕ
dŏṁtara valabulagu dosilŏggavaladā
(||sinna||)
nanubuna nādi nīdo navve navvulagu
vŏnaram̐ga nīsedula nŏḍḍugŏnevu
nanusanivām̐ḍavā naṁṭudo dŏravu nīvu
pĕnam̐ge tamagānagum̐ briyabaḍavaladā
(||sinna||)
komali śhrīveṁkaḍeśha kūḍĕ nī kūḍamulagu
momu sūsi yaṁtalone mŏkku mŏkkevu
sāmānyabuvām̐ḍavā sarveśhvarum̐ḍa vidĕ
gomuna nĕṁtavaḍainām̐ gŏsaram̐ga valadā