Sinnadanamo yidi siggaridanamamdamo

చిన్నతనమో యిది సిగ్గరితనమందమో
Language

(॥పల్లవి॥)
చిన్నతనమో యిది సిగ్గరితనమందమో
కన్నులఁ జూచి యెంత కాతరించీఁ దాను

(॥చిన్న॥)
చనవున నే నీతో జాణతనా లాడఁగాను
విని విని యీకె యేల వేసరీఁ దాను
పని వూని నే నీకు పాదములు పిసుకఁగా
మొనసి యెందుకు నేల మోము వంచీఁ దాను

(॥చిన్న॥)
పెచ్చు రేఁగి నీవు నేనుఁ బెనఁగులాడఁగాను
వచ్చి వచ్చి యీపె యేల వద్దనీఁ దాను
మెచ్చులుగాఁ గస్తూరి మేన నేనె పూయఁగాను
అచ్చపుఁ జన్నుల నిన్ను నద్దుకొనీఁ దాను

(॥చిన్న॥)
వూడిగాలు నేను నీకు వొద్దనుండి సేయఁగాను
కూడి కూడి యీకె యేల కొసరీఁ దాను
యీడ నే నలమేల్ మంగ నిదె శ్రీవేకంటేశ్వర
వేడుక నన్నేలితివి విందుచెప్పీఁ దాను

(||pallavi||)
sinnadanamo yidi siggaridanamaṁdamo
kannulam̐ jūsi yĕṁta kādariṁchīm̐ dānu

(||sinna||)
sanavuna ne nīdo jāṇadanā lāḍam̐gānu
vini vini yīgĕ yela vesarīm̐ dānu
pani vūni ne nīgu pādamulu pisugam̐gā
mŏnasi yĕṁdugu nela momu vaṁchīm̐ dānu

(||sinna||)
pĕchchu rem̐gi nīvu nenum̐ bĕnam̐gulāḍam̐gānu
vachchi vachchi yībĕ yela vaddanīm̐ dānu
mĕchchulugām̐ gastūri mena nenĕ pūyam̐gānu
achchabum̐ jannula ninnu naddugŏnīm̐ dānu

(||sinna||)
vūḍigālu nenu nīgu vŏddanuṁḍi seyam̐gānu
kūḍi kūḍi yīgĕ yela kŏsarīm̐ dānu
yīḍa ne nalamel maṁga nidĕ śhrīvegaṁṭeśhvara
veḍuga nannelidivi viṁdusĕppīm̐ dānu