Sinnadaanavu ganaga seppidi neegee buddulu

చిన్నదానవు గనక చెప్పితి నీకీ బుద్దులు
Language

(॥పల్లవి॥)
చిన్నదానవు గనక చెప్పితి నీకీ బుద్దులు
పన్నుక నీ పొందులివి పాయకిట్టె సేయవే

(॥చిన్న॥)
తప్పక చూచితేనే తగులాయములు వుట్టు
చిప్పిలఁగ నవ్వితేనే చిత్తములంటు
చొప్పఁగా మాటలాడితే చుట్టరికములు రేఁగు
యెప్పడూను పతిపొందు లేమరక సేయవే

(॥చిన్న॥)
కొలువులు సేసితేను కోరికలు కొనసాగు
వెలినుండి వేఁడుకొంటే వేడుకగల్గు
తలకొని చెనకితే తమకము లుప్పతిలు
మలసి నీపతిపొందు మఱవక సేయవే

(॥చిన్న॥)
వావులు దలపెట్టితే వాడికలు సమకూడు
మోవితేనె చూపితేను మోహము మెండు
యీవేళ నిన్నుఁగూడె ఇదియే యలవాటౌను
శ్రీవేంటేశ్వరుపొందు సేనలుగాఁ జేయవే

(||pallavi||)
sinnadānavu ganaga sĕppidi nīgī buddulu
pannuga nī pŏṁdulivi pāyagiṭṭĕ seyave

(||sinna||)
tappaga sūsidene tagulāyamulu vuṭṭu
sippilam̐ga navvidene sittamulaṁṭu
sŏppam̐gā māḍalāḍide suṭṭarigamulu rem̐gu
yĕppaḍūnu padibŏṁdu lemaraga seyave

(||sinna||)
kŏluvulu sesidenu korigalu kŏnasāgu
vĕlinuṁḍi vem̐ḍugŏṁṭe veḍugagalgu
talagŏni sĕnagide tamagamu luppadilu
malasi nībadibŏṁdu maṟavaga seyave

(||sinna||)
vāvulu dalabĕṭṭide vāḍigalu samagūḍu
movidenĕ sūbidenu mohamu mĕṁḍu
yīveḽa ninnum̐gūḍĕ idiye yalavāḍaunu
śhrīveṁṭeśhvarubŏṁdu senalugām̐ jeyave