Sinnadaanavainaanu semtalivi melamma

చిన్నదానవైనాను చేఁతలివి మేలమ్మ
Language

(॥పల్లవి॥)
చిన్నదానవైనాను చేఁతలివి మేలమ్మ
నిన్నుఁ జూచిన సతులెల్లా నేఁడు మెచ్చేరమ్మా

(॥॥)
చెక్కునఁబెట్టినచేయి సెలవినవ్విననవ్వు
తక్కక వోచెలి నీకే తగునమ్మా
పక్కన నిట్టూర్పులును పతితోడిమాటలు
నెక్కొని యింతేసి యాడ నేరిచితివమ్మా

(॥॥)
తేలగింపుఁజూపులును తియ్యనివినయములు
కాలమందే నీయందే కంటిమమ్మా
తాలిమి నివ్వెరగులు తమకపుఁగరఁగులు
వేళతో విభునిమీఁద వేసితివమ్మా

(॥॥)
వసివాడునటనలు వలపులఘటనలు
యెసరెత్తివి నేఁడే యేమమ్మా
కొసరి శ్రీ వేంకటేశుఁ గూడితి వింతటిలోనే
రసికతనము నీకు రతికెక్కెనమ్మా

(||pallavi||)
sinnadānavainānu sem̐talivi melamma
ninnum̐ jūsina sadulĕllā nem̐ḍu mĕchcherammā

(||||)
sĕkkunam̐bĕṭṭinaseyi sĕlavinavvinanavvu
takkaga vosĕli nīge tagunammā
pakkana niṭṭūrbulunu padidoḍimāḍalu
nĕkkŏni yiṁtesi yāḍa nerisidivammā

(||||)
telagiṁpum̐jūbulunu tiyyanivinayamulu
kālamaṁde nīyaṁde kaṁṭimammā
tālimi nivvĕragulu tamagabum̐garam̐gulu
veḽado vibhunimīm̐da vesidivammā

(||||)
vasivāḍunaḍanalu valabulaghaḍanalu
yĕsarĕttivi nem̐ḍe yemammā
kŏsari śhrī veṁkaḍeśhum̐ gūḍidi viṁtaḍilone
rasigadanamu nīgu radigĕkkĕnammā