చిన్నదానవైతేనేమి చేఁతలన్నీ నేరుతువు
(॥పల్లవి॥)
చిన్నదానవైతేనేమి చేఁతలన్నీ నేరుతువు
పన్నుకొన్న సుద్దులు గంపల నింతువుగాని
(॥చిన్న॥)
నించవే యాతనిమీఁద నెట్టుకొని వలపులు
పెంచవే నీలోనఁగల ప్రియములెల్లా
వంచవే యెట్టనెదుట వాలుక చూపు లప్పటి
కంచపు మోవి తేనెలు కాఁగులనింతువుగాని
(॥చిన్న॥)
కోరవే యాతనితోడికూటములే యేపొద్దు
చేరవే పానుపుమీఁద సిగ్గువడక
నేరవే యాతనిచేత నెయ్యపుసరసములు
గారవపు వేడుకలు గాదెఁబోతువుగాని
(॥చిన్న॥)
మొక్కవే యాతనికి నీ మొనగోరి చేతులను
తొక్కవే పాదము లిదె తొలుత పెండ్లి
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డిటు నన్నూ నిన్ను నేలె
చక్కగా నాసలు కణఁజాలనింతువుగాని
(||pallavi||)
sinnadānavaidenemi sem̐talannī neruduvu
pannugŏnna suddulu gaṁpala niṁtuvugāni
(||sinna||)
niṁchave yādanimīm̐da nĕṭṭugŏni valabulu
pĕṁchave nīlonam̐gala priyamulĕllā
vaṁchave yĕṭṭanĕduḍa vāluga sūbu lappaḍi
kaṁchabu movi tenĕlu kām̐gulaniṁtuvugāni
(||sinna||)
korave yādanidoḍigūḍamule yebŏddu
serave pānubumīm̐da sigguvaḍaga
nerave yādaniseda nĕyyabusarasamulu
gāravabu veḍugalu gādĕm̐boduvugāni
(||sinna||)
mŏkkave yādanigi nī mŏnagori sedulanu
tŏkkave pādamu lidĕ tŏluda pĕṁḍli
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiḍu nannū ninnu nelĕ
sakkagā nāsalu kaṇam̐jālaniṁtuvugāni