చిన్నదాననంటానే సిగ్గులేల పెంచేవు
(॥పల్లవి॥)
చిన్నదాననంటానే సిగ్గులేల పెంచేవు
సన్నసేసి మొక్కవమ్మా చతురుఁ డీతఁడు
(॥చిన్న॥)
చనవు నీకు నొసఁగి చవులుగా మాఁటలాడీ
వినవమ్మా యిదివో నీ విభుఁడు
చెనకి చెనకి నిన్నుఁ జెక్కునొక్కి వేఁడుకొనీ
పెనఁగకువమ్మా నీపైఁ బ్రేమగలఁ డితఁడు
(॥చిన్న॥)
కప్పురము నీపైఁ జల్లి కాచుకున్నాఁ డెదుటను
తప్పక చూడమ్మా యాతని మోము
చిప్పిలుమోవి చూపి సెలవుల నవ్వు నవ్వీ
తప్పించుకోకువమ్మా తమకించీ నితెఁడు
(॥చిన్న॥)
గారవించి కూడి నిన్నుఁ గరుణతో మన్నించీ
చేరి కాఁగిలించవమ్మా శ్రీవేంకటేశు
సారెకు వలపు చల్లి సరసము లాడీని
మేరలు మీరకువమ్మా మేలుగలఁ డితఁడు
(||pallavi||)
sinnadānanaṁṭāne siggulela pĕṁchevu
sannasesi mŏkkavammā sadurum̐ ḍīdam̐ḍu
(||sinna||)
sanavu nīgu nŏsam̐gi savulugā mām̐ṭalāḍī
vinavammā yidivo nī vibhum̐ḍu
sĕnagi sĕnagi ninnum̐ jĕkkunŏkki vem̐ḍugŏnī
pĕnam̐gaguvammā nībaim̐ bremagalam̐ ḍidam̐ḍu
(||sinna||)
kappuramu nībaim̐ jalli kāsugunnām̐ ḍĕduḍanu
tappaga sūḍammā yādani momu
sippilumovi sūbi sĕlavula navvu navvī
tappiṁchugoguvammā tamagiṁchī nidĕm̐ḍu
(||sinna||)
gāraviṁchi kūḍi ninnum̐ garuṇado manniṁchī
seri kām̐giliṁchavammā śhrīveṁkaḍeśhu
sārĕgu valabu salli sarasamu lāḍīni
meralu mīraguvammā melugalam̐ ḍidam̐ḍu