చిన్నదాననంటా నీవు సిగ్గువడేవే
(॥పల్లవి॥)
చిన్నదాననంటా నీవు సిగ్గువడేవే
చన్నులను (నొ?)రసి మోవి చవిచూపఁగదవే
(॥చిన్న॥)
చేరి చూడఁగఁజూడఁగా చీఁకటి వెలుగందురు
పేరఁబెట్టితే పాలే పెరుగందురు
కోరి కాచుకుండితే చిగురులే చేగలందురు
వోరుపుతో నాతని వూడిగాలే సేయవే
(॥చిన్న॥)
మరుఁగగా మరుఁగగా మచ్చికవుట్టు నందురు
పెరిగితే పూఁపలే పిందె లందురు
నెరులు గూడఁగాగూడఁగా నిండుఁగొప్పాయనందురు
సరసము లాతనితో సారె సారె నాడవే
(॥చిన్న॥)
మఱి చెప్పఁగాఁజెప్పఁగా మాఁటలే కత లందురు
తఱుచు పొదుసేసితే తగు లందురు
చిఱునవ్వులతో నిన్ను శ్రీవేంకటేశుఁడు గూడె
మెఱసి పెక్కురతుల మెప్పించవే
(||pallavi||)
sinnadānanaṁṭā nīvu sigguvaḍeve
sannulanu (nŏ?)rasi movi savisūbam̐gadave
(||sinna||)
seri sūḍam̐gam̐jūḍam̐gā sīm̐kaḍi vĕlugaṁduru
peram̐bĕṭṭide pāle pĕrugaṁduru
kori kāsuguṁḍide sigurule segalaṁduru
vorubudo nādani vūḍigāle seyave
(||sinna||)
marum̐gagā marum̐gagā machchigavuṭṭu naṁduru
pĕrigide pūm̐pale piṁdĕ laṁduru
nĕrulu gūḍam̐gāgūḍam̐gā niṁḍum̐gŏppāyanaṁduru
sarasamu lādanido sārĕ sārĕ nāḍave
(||sinna||)
maṟi sĕppam̐gām̐jĕppam̐gā mām̐ṭale kada laṁduru
taṟusu pŏduseside tagu laṁduru
siṟunavvulado ninnu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
mĕṟasi pĕkkuradula mĕppiṁchave