Sinnadaanam jesinattu seyumanave

చిన్నదానఁ జేసినట్టు సేయుమనవే
Language

(॥పల్లవి॥)
చిన్నదానఁ జేసినట్టు సేయుమనవే
విన్నపమిదే తనకు వేవేల కనవే

(॥చిన్న॥)
సిగ్గువడ్డచిత్త మిది చేరి మాటాడనియ్యదు
యెగ్గుపట్టుఁ జో నాతఁ డేమిసేతునే
అగ్గలపు సతులలో అరితేరినట్టి వాఁడు
వొగ్గి తానే యిప్పుడు నా వొద్దికి రమ్మనవే

(॥చిన్న॥)
జవ్వనపుమద మిది సరసములాడనీదు
రవ్వఁ గాఁతాళించునేమో రతి నతఁడు
యివ్వల నావంటివారి నెదుగా నేలినతాను
మవ్వవుఁగూరిమి నన్ను మాటాడించుమనవే

(॥చిన్న॥)
తనకాఁగిటిదేహము తగులు వాయఁగనీదు
అను వెట్లనో తనక దెఱఁగనే
యెననెను శ్రీవేంకటేశుఁ డిన్నిటాఁ దాను
మనసుమర్మ మెరిఁగి మన్నించుమనవె

(||pallavi||)
sinnadānam̐ jesinaṭṭu seyumanave
vinnabamide tanagu vevela kanave

(||sinna||)
sigguvaḍḍasitta midi seri māḍāḍaniyyadu
yĕggubaṭṭum̐ jo nādam̐ ḍemisedune
aggalabu sadulalo ariderinaṭṭi vām̐ḍu
vŏggi tāne yippuḍu nā vŏddigi rammanave

(||sinna||)
javvanabumada midi sarasamulāḍanīdu
ravvam̐ gām̐tāḽiṁchunemo radi nadam̐ḍu
yivvala nāvaṁṭivāri nĕdugā nelinadānu
mavvavum̐gūrimi nannu māḍāḍiṁchumanave

(||sinna||)
tanagām̐giḍidehamu tagulu vāyam̐ganīdu
anu vĕṭlano tanaga dĕṟam̐gane
yĕnanĕnu śhrīveṁkaḍeśhum̐ ḍinniḍām̐ dānu
manasumarma mĕrim̐gi manniṁchumanavĕ