Sinnadaanam jeppenamte siggayyee naagu

చిన్నదానఁ జెప్పేనంటే సిగ్గయ్యీ నాకు
Language

(॥పల్లవి॥)
చిన్నదానఁ జెప్పేనంటే సిగ్గయ్యీ నాకు
తన్నుఁ దానే తెలుసుక దక్కి వుండు మనవే

(॥చిన్న॥)
సొలపుఁజూపుల తొల్లి చూచినచుట్టురికము
పలుమారు నెడతాఁకి పాయని చుట్టరికము
తలపోఁతలనే కడు దక్కిన చుట్టరికము
కలదు తనకు నాకుఁ గరుణించు మనవే

(॥చిన్న॥)
మాఁటలనే మరిగిన మచ్చిక చుట్టరికము
నాటుకొన్న వలపుల నమ్మిన చుట్టరిము
తేటల సరసముల తెగని చుట్టరికము
పూఁట వూఁట కిట్లానే పొదలించు మనవే

(॥చిన్న॥)
యెనసిన కాఁగిళ్ళలో హెచ్చిన చుట్టరికము
మనసు మర్మములనే మాఁగిన చుట్టరికము
తన దేవి నలమేల్మంగను తానే శ్రీవేంకటేశుఁ
డొనర నన్నేలె నింకాఁ జనవు లిమ్మనవే

(||pallavi||)
sinnadānam̐ jĕppenaṁṭe siggayyī nāgu
tannum̐ dāne tĕlusuga dakki vuṁḍu manave

(||sinna||)
sŏlabum̐jūbula tŏlli sūsinasuṭṭurigamu
palumāru nĕḍadām̐ki pāyani suṭṭarigamu
talabom̐talane kaḍu dakkina suṭṭarigamu
kaladu tanagu nāgum̐ garuṇiṁchu manave

(||sinna||)
mām̐ṭalane marigina machchiga suṭṭarigamu
nāḍugŏnna valabula nammina suṭṭarimu
teḍala sarasamula tĕgani suṭṭarigamu
pūm̐ṭa vūm̐ṭa kiṭlāne pŏdaliṁchu manave

(||sinna||)
yĕnasina kām̐giḽḽalo hĕchchina suṭṭarigamu
manasu marmamulane mām̐gina suṭṭarigamu
tana devi nalamelmaṁganu tāne śhrīveṁkaḍeśhum̐
ḍŏnara nannelĕ niṁkām̐ janavu limmanave