Sinnadaana vaidenemi semtalu peddavigaavaa

చిన్నదాన వైతేనేమి చేఁతలు పెద్దవిగావా
Language

(॥పల్లవి॥)
చిన్నదాన వైతేనేమి చేఁతలు పెద్దవిగావా
సన్నలా చాయలా నీకు జడియఁగ నేఁటికే

(॥చిన్న॥)
నిక్కినిక్కి పతిఁజూచి నీడనుండి యలసేవు
చెక్కులవెంటాఁ జెమట చిందుకొనేవు
అక్కర ఇంతగలితే నాతనిఁ బెండ్లాడరాదా
వుక్కుమీరి యాసలను వుమ్మగిలనేఁటికి

(॥చిన్న॥)
చేరిచేరి మాటలాడి చెనకి బయలీఁదేవు
వూరకే లోలో నస్సురుస్సురంటాను
కూరిమింత గలిగితే కొంగుపట్టి తియ్యరాదా
సారాసారె కొప్పువీడి జాలిబడనేఁటికి

(॥చిన్న॥)
వచ్చివచ్చి నవ్వునవ్వి వలపు చవిగొనేవు
మెచ్చె శ్రీవేంకటేశుఁ డల మేలుమంగవు
మచ్చికింత గలిగితే మరిమరిఁ గూడరాదా
యిచ్చ నన్నేలీ నీవిఁక నెచ్చకించనేఁటికే

(||pallavi||)
sinnadāna vaidenemi sem̐talu pĕddavigāvā
sannalā sāyalā nīgu jaḍiyam̐ga nem̐ṭige

(||sinna||)
nikkinikki padim̐jūsi nīḍanuṁḍi yalasevu
sĕkkulavĕṁṭām̐ jĕmaḍa siṁdugŏnevu
akkara iṁtagalide nādanim̐ bĕṁḍlāḍarādā
vukkumīri yāsalanu vummagilanem̐ṭigi

(||sinna||)
seriseri māḍalāḍi sĕnagi bayalīm̐devu
vūrage lolo nassurussuraṁṭānu
kūrimiṁta galigide kŏṁgubaṭṭi tiyyarādā
sārāsārĕ kŏppuvīḍi jālibaḍanem̐ṭigi

(||sinna||)
vachchivachchi navvunavvi valabu savigŏnevu
mĕchchĕ śhrīveṁkaḍeśhum̐ ḍala melumaṁgavu
machchigiṁta galigide marimarim̐ gūḍarādā
yichcha nannelī nīvim̐ka nĕchchagiṁchanem̐ṭige