Sinnadaana namtaanu siggulela pemchevu

చిన్నదాన నంటాను సిగ్గులేల పెంచేవు
Language

(॥పల్లవి॥)
చిన్నదాన నంటాను సిగ్గులేల పెంచేవు
మన్నించె నితఁడు మఱఁగేల యిఁకను

(॥చిన్న॥)
చక్కర పెదవులతో సకియ మాఁటాడవే
నెక్కొని సుద్దు లడిగీ నీ రమణుఁడు
జక్కవ చన్నులదాన సంగడిఁ గూచుండవే
అక్కరతోఁ గాఁగిటికి నంగవించీ నతఁడు

(॥చిన్న॥)
కలువకన్నుల యమ్మ కాంతునిదిక్కు చూడవే
అలరుచు నీకు మొగమై యున్నాఁడు
సెలవి నవ్వుల చెలి చేరి సరసమాడవే
కలసేనంటా నీవేళ గాచుకున్నాఁడు

(॥చిన్న॥)
కనకపు బొమ్మ శ్రీవేంకటేశుఁ గాఁగిలించవే
మనసు నీకే మీఁదెత్తి మరిగెఁదాను
ననిచి తమ్మిచేతుల నాతి విడెమియ్యవే
వొనరి నీరతులలో నోలలాడీ నిపుడు

(||pallavi||)
sinnadāna naṁṭānu siggulela pĕṁchevu
manniṁchĕ nidam̐ḍu maṟam̐gela yim̐kanu

(||sinna||)
sakkara pĕdavulado sagiya mām̐ṭāḍave
nĕkkŏni suddu laḍigī nī ramaṇum̐ḍu
jakkava sannuladāna saṁgaḍim̐ gūsuṁḍave
akkaradom̐ gām̐giḍigi naṁgaviṁchī nadam̐ḍu

(||sinna||)
kaluvagannula yamma kāṁtunidikku sūḍave
alarusu nīgu mŏgamai yunnām̐ḍu
sĕlavi navvula sĕli seri sarasamāḍave
kalasenaṁṭā nīveḽa gāsugunnām̐ḍu

(||sinna||)
kanagabu bŏmma śhrīveṁkaḍeśhum̐ gām̐giliṁchave
manasu nīge mīm̐dĕtti marigĕm̐dānu
nanisi tammisedula nādi viḍĕmiyyave
vŏnari nīradulalo nolalāḍī nibuḍu