Simtimchagure imkam jelulaala

చింతించకురే ఇఁకఁ జెలులాల
Language

(॥పల్లవి॥)
చింతించకురే ఇఁకఁ జెలులాల
మంతుకెక్కె నిన్నీ మన్నీంచీలె??? కనకా

(॥చింతిం॥)
కలికి తుమ్మిదలు కడుఁ జుట్టాలు
పొలసి కురులు వాఁటిఁ బోలుఁగనక
కలదు మొగమోట మక్కడ శశికి
వెలలేని యీపెనవ్వు వెన్నెలలే కనకా

(॥చింతిం॥)
పడఁతికి చిలుకలు ప్రాణప్రదము
అడరి యీకె మాఁటలు అవే కనక
విడువరాని పొందు కోవిల లీపెకు
తొడరి యీపె యెలుఁగుతో సరి గనకా

(॥చింతిం॥)
అతివకు విరులు పాయని చెలిమి
తతి నీపె మేనితావిఁ దగుఁగనక
అతనుఁ దీపెకు నెనరైనవాఁడు
యితవై శ్రీవేంకటేశు నెనయించెఁ గనకా

(||pallavi||)
siṁtiṁchagure im̐kam̐ jĕlulāla
maṁtugĕkkĕ ninnī mannīṁchīlĕ??? kanagā

(||siṁtiṁ||)
kaligi tummidalu kaḍum̐ juṭṭālu
pŏlasi kurulu vām̐ṭim̐ bolum̐ganaga
kaladu mŏgamoḍa makkaḍa śhaśhigi
vĕlaleni yībĕnavvu vĕnnĕlale kanagā

(||siṁtiṁ||)
paḍam̐tigi silugalu prāṇapradamu
aḍari yīgĕ mām̐ṭalu ave kanaga
viḍuvarāni pŏṁdu kovila lībĕgu
tŏḍari yībĕ yĕlum̐gudo sari ganagā

(||siṁtiṁ||)
adivagu virulu pāyani sĕlimi
tadi nībĕ menidāvim̐ dagum̐ganaga
adanum̐ dībĕgu nĕnarainavām̐ḍu
yidavai śhrīveṁkaḍeśhu nĕnayiṁchĕm̐ ganagā