చింతవంత లిఁకనేల చెలుల దూరఁగనేల
(॥పల్లవి॥)
చింతవంత లిఁకనేల చెలుల దూరఁగనేల
దొంతుల రతులే నీకు దోడాయఁగా
(॥॥)
తలఁచఁగానే వచ్చె తనుఁదానే రమణుఁడు
మలసి నీకిఁక మొక్క మనసాయఁగా
ఆలుక లిన్నియుఁ బానె నతఁడె నీతో నవ్వె
పలుకుఁ బంతము నొక్కపాటాయఁగా
(॥॥)
ఆనుమానించఁగనే యతఁడు నీచేయి వట్టె
యెనయు నీకోరికెల్లా నీడెరెఁగా
చనవల్లా నీకుఁ జెల్లె సరసుఁడు నిను మెచ్చె
కొనకెక్కినవలపు గురుతాయఁగా
(॥॥)
మొక్కఁగా నాతఁడు నీకు ముందర వరము లిచ్చె
చక్కనై న సకినాలు సరిదాఁకెఁగా
చెక్కులెల్లాఁ జెమరించె శ్రీవేంకటేశుఁడు గూడె
యెక్కువ నీసంతసము లిరవాయఁగా
(||pallavi||)
siṁtavaṁta lim̐kanela sĕlula dūram̐ganela
dŏṁtula radule nīgu doḍāyam̐gā
(||||)
talam̐sam̐gāne vachchĕ tanum̐dāne ramaṇum̐ḍu
malasi nīgim̐ka mŏkka manasāyam̐gā
āluga linniyum̐ bānĕ nadam̐ḍĕ nīdo navvĕ
palugum̐ baṁtamu nŏkkabāḍāyam̐gā
(||||)
ānumāniṁcham̐gane yadam̐ḍu nīseyi vaṭṭĕ
yĕnayu nīgorigĕllā nīḍĕrĕm̐gā
sanavallā nīgum̐ jĕllĕ sarasum̐ḍu ninu mĕchchĕ
kŏnagĕkkinavalabu gurudāyam̐gā
(||||)
mŏkkam̐gā nādam̐ḍu nīgu muṁdara varamu lichchĕ
sakkanai na saginālu saridām̐kĕm̐gā
sĕkkulĕllām̐ jĕmariṁchĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
yĕkkuva nīsaṁtasamu liravāyam̐gā