Simtalam jigurulu senagulam jemgalu

చింతలఁ జిగురులు చెనకులఁ జేఁగలు
Language

(॥పల్లవి॥)
చింతలఁ జిగురులు చెనకులఁ జేఁగలు
వంతల నీ చలములు వద్దే యిఁకను

(॥చింతల॥)
చెలి నీ సిగ్గు లివిగో సెలవి వెన్నల గాయ
యెలమి బొమ్మలజంకె యెండ గాసీనె
వలచి విభుఁ డిందుకే వాడుచు వాడుదేరీని
కలువ చూపు లయినఁ గప్పవే మీఁదను

(॥చింతల॥)
మాటలతేనెలోన మధురము గురియఁగ
గాఁటపు నీ బిగువులు కార మయ్యీనె
వీఁటనె విభుఁ డిందుకు వీఁగీని లోఁగీని
పాటల రాగాల చిలుపా లైనఁ బోయవే

(॥చింతల॥)
కాంత నీ కాఁగి లనేటి కమ్మఁబూఁదీగెఁ బొదిగీ
యింత నీ ముండ్లగోళ్లనేల వొత్తేవే
పంతపు శ్రీవెంకటాద్రిపతి యిట్టె నన్నుఁ గూడె
అంతలో మెత్తనివినయము లైనఁ జేయవే

(||pallavi||)
siṁtalam̐ jigurulu sĕnagulam̐ jem̐galu
vaṁtala nī salamulu vadde yim̐kanu

(||siṁtala||)
sĕli nī siggu livigo sĕlavi vĕnnala gāya
yĕlami bŏmmalajaṁkĕ yĕṁḍa gāsīnĕ
valasi vibhum̐ ḍiṁduge vāḍusu vāḍuderīni
kaluva sūbu layinam̐ gappave mīm̐danu

(||siṁtala||)
māḍaladenĕlona madhuramu guriyam̐ga
gām̐ṭabu nī biguvulu kāra mayyīnĕ
vīm̐ṭanĕ vibhum̐ ḍiṁdugu vīm̐gīni lom̐gīni
pāḍala rāgāla silubā lainam̐ boyave

(||siṁtala||)
kāṁta nī kām̐gi laneḍi kammam̐būm̐dīgĕm̐ bŏdigī
yiṁta nī muṁḍlagoḽlanela vŏtteve
paṁtabu śhrīvĕṁkaḍādribadi yiṭṭĕ nannum̐ gūḍĕ
aṁtalo mĕttanivinayamu lainam̐ jeyave