Simtagaaya kajjaayamu seluvunidodi pomdu

చింతకాయ కజ్జాయము చెలువునితోడి పొందు
Language

(॥పల్లవి॥)
చింతకాయ కజ్జాయము చెలువునితోడి పొందు
పంతముతో నీతని మోపవే గట్టిచన్నులు

(॥చింత॥)
కొచ్చి కొచ్చి పెనఁగఁగా గుబ్బతిలె వలిపులు
తచ్చి తచ్చి మాఁటాడఁగా తమి రేఁగెను
హెచ్చి రారాఁపులవంక నికా నెంత పెరుగునో
ఇచ్చకమే సేసి పతి కియ్యఁగదే విడెము

(॥చింత॥)
చిమ్మి చిమ్మి చూడఁగాను చీఁదరగోనె వెడుర(క?)
కమ్మి కమ్మి చెనకఁగా కళదాఁకెను
యెమ్మెలఁ బొరలఁగాను యెట్టుండి యెట్టౌనో
వుమ్మడి నీతనిఁజేరి వొత్తవే పాదాలు

(॥చింత॥)
మోణి మిఱి జంకించఁగా మిక్కుటమాయఁదగులు
తూఱి తూఱి నవ్వఁగా బొత్తులు గలసె
జాఱక శ్రీవేంకటేశు సంగాతమెంత మేలౌనో
ఆఱడి గాఁగిలించవే అలమేలుమంగవు

(||pallavi||)
siṁtagāya kajjāyamu sĕluvunidoḍi pŏṁdu
paṁtamudo nīdani mobave gaṭṭisannulu

(||siṁta||)
kŏchchi kŏchchi pĕnam̐gam̐gā gubbadilĕ valibulu
tachchi tachchi mām̐ṭāḍam̐gā tami rem̐gĕnu
hĕchchi rārām̐pulavaṁka nigā nĕṁta pĕruguno
ichchagame sesi padi kiyyam̐gade viḍĕmu

(||siṁta||)
simmi simmi sūḍam̐gānu sīm̐daragonĕ vĕḍura(ka?)
kammi kammi sĕnagam̐gā kaḽadām̐kĕnu
yĕmmĕlam̐ bŏralam̐gānu yĕṭṭuṁḍi yĕṭṭauno
vummaḍi nīdanim̐jeri vŏttave pādālu

(||siṁta||)
moṇi miṟi jaṁkiṁcham̐gā mikkuḍamāyam̐dagulu
tūṟi tūṟi navvam̐gā bŏttulu galasĕ
jāṟaga śhrīveṁkaḍeśhu saṁgādamĕṁta melauno
āṟaḍi gām̐giliṁchave alamelumaṁgavu