చిమ్ముచుఁ దియ్యని నోరఁ జేఁ దేల
(॥పల్లవి॥)
చిమ్ముచుఁ దియ్యని నోరఁ జేఁ దేల
నెమ్మది నాకె వుండఁగ నే మేలా
(॥చిమ్ముచు॥)
మన సిచ్చి నీతోడ మాఁట లాడేవారితోనె
అనవయ్య పోయి నీ వామాఁట
వెనకటిమాఁటలకె వేదనఁ బొరలేమమ్ము
చెనకి మరిఁ గొంత చింత రేఁచ వలెనా
(॥చిమ్ముచు॥)
మొగము చూచి నీకు మొక్కెటివారితోనె
నగవయ్య పోయి నీవు నయమునా
జగడించి పైఁ జేయి చాఁచి మూల నున్ననన్ను
తగిలి తగిలి యింకఁ దతి గొన వలెనా
(॥చిమ్ముచు॥)
పలుమారు సిగ్గుదేరి పారితెంచేవారినె
పిలవవయ్య పోయి ప్రియమునా
అలిగిననన్ను నిట్టె ఆదరించి కూడితివి
యెలమి శ్రీవెంకటేశ యిఁకఁ గొంత వలెనా
(||pallavi||)
simmusum̐ diyyani noram̐ jem̐ dela
nĕmmadi nāgĕ vuṁḍam̐ga ne melā
(||simmusu||)
mana sichchi nīdoḍa mām̐ṭa lāḍevāridonĕ
anavayya poyi nī vāmām̐ṭa
vĕnagaḍimām̐ṭalagĕ vedanam̐ bŏralemammu
sĕnagi marim̐ gŏṁta siṁta rem̐sa valĕnā
(||simmusu||)
mŏgamu sūsi nīgu mŏkkĕḍivāridonĕ
nagavayya poyi nīvu nayamunā
jagaḍiṁchi paim̐ jeyi sām̐si mūla nunnanannu
tagili tagili yiṁkam̐ dadi gŏna valĕnā
(||simmusu||)
palumāru sigguderi pāridĕṁchevārinĕ
pilavavayya poyi priyamunā
aliginanannu niṭṭĕ ādariṁchi kūḍidivi
yĕlami śhrīvĕṁkaḍeśha yim̐kam̐ gŏṁta valĕnā