Simmi remginaduvale sesinade semtagaaga

చిమ్మి రేఁగినటువలె సేసినదే చేఁతగాక
Language

(॥పల్లవి॥)
చిమ్మి రేఁగినటువలె సేసినదే చేఁతగాక
దొమ్మి సరసములోన తొలఁగఁ జోటున్నదా

(॥చిమ్మి॥)
సెలవుల నవ్వు నవ్వ చెంగలిచూపులఁ జూచి
పలుకులఁ దరితీపు పచరించి
నిలుచున్న దిదె చూడు నీవేల సిగ్గువడేవు
వలపులజాజరకు వాసివంతు లెంతురా

(॥చిమ్మి॥)
చన్నులు కానుకచూపి సంగడిఁ గొలువుసేసి
సన్నలనే ప్రియములు చాలాఁ జెప్పి
యిన్నిటా నిన్నుఁ గొసరీ యెక్కడ పరాకు నీకు
పున్నమవెన్నెలపొళ్లు పూచి కుప్పసేతురా

(॥చిమ్మి॥)
తనువున నిన్నొరసి తమకము పెడరేఁచి
వినుకలిఁ గనుకలి వింతసేసి
యెనసె శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
మనసులోఁ బాలు దాగి మరి లెక్కసేతురా

(||pallavi||)
simmi rem̐ginaḍuvalĕ sesinade sem̐tagāga
dŏmmi sarasamulona tŏlam̐gam̐ joḍunnadā

(||simmi||)
sĕlavula navvu navva sĕṁgalisūbulam̐ jūsi
palugulam̐ daridību pasariṁchi
nilusunna didĕ sūḍu nīvela sigguvaḍevu
valabulajājaragu vāsivaṁtu lĕṁturā

(||simmi||)
sannulu kānugasūbi saṁgaḍim̐ gŏluvusesi
sannalane priyamulu sālām̐ jĕppi
yinniḍā ninnum̐ gŏsarī yĕkkaḍa parāgu nīgu
punnamavĕnnĕlabŏḽlu pūsi kuppasedurā

(||simmi||)
tanuvuna ninnŏrasi tamagamu pĕḍarem̐si
vinugalim̐ ganugali viṁtasesi
yĕnasĕ śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
manasulom̐ bālu dāgi mari lĕkkasedurā