సింగారరసములోనఁ జీకాకులేలే
(॥పల్లవి॥)
సింగారరసములోనఁ జీకాకులేలే
అంగన నీవే నేను అనుమాన మేలే
(॥సింగా॥)
మాణికాల పెట్టెవంటి మగవ నీనోర నన్ను
జాణనిష్టూరా లిన్నేసి చల్లఁదగదే
ఆణిముద్యాల చిప్పలయంతలు గన్నుల నన్ను
రాణించు వేఁడిచూపుల రమణి చూడకువే
(॥సింగా॥)
చెల్నిచందురువంటి సతి నీ మోమున నన్ను
చల్లు వెడబోమ్మలను జంకించనేలే
యెల్లగాఁ జిగురువంటి వివిగొ నీ కరములు
వెల్లవిరిగాఁ బట్టితే విదిలించనేలే
(॥సింగా॥)
బంగారువోపరివంటిపడఁతి నీ కాఁగిటిలో
చెంగలింపు సిగ్గులనే చీఁకటు లేలే
రంగగు శ్రీవేంకటాద్రిరాడఁడఁ గూడితి నిన్ను
ముంగురల నీలాలముసుఁ గింకనేలే
(||pallavi||)
siṁgārarasamulonam̐ jīgāgulele
aṁgana nīve nenu anumāna mele
(||siṁgā||)
māṇigāla pĕṭṭĕvaṁṭi magava nīnora nannu
jāṇaniṣhṭūrā linnesi sallam̐dagade
āṇimudyāla sippalayaṁtalu gannula nannu
rāṇiṁchu vem̐ḍisūbula ramaṇi sūḍaguve
(||siṁgā||)
sĕlnisaṁduruvaṁṭi sadi nī momuna nannu
sallu vĕḍabommalanu jaṁkiṁchanele
yĕllagām̐ jiguruvaṁṭi vivigŏ nī karamulu
vĕllavirigām̐ baṭṭide vidiliṁchanele
(||siṁgā||)
baṁgāruvobarivaṁṭibaḍam̐ti nī kām̐giḍilo
sĕṁgaliṁpu siggulane sīm̐kaḍu lele
raṁgagu śhrīveṁkaḍādrirāḍam̐ḍam̐ gūḍidi ninnu
muṁgurala nīlālamusum̐ giṁkanele