Simgaararaayumda vaudu sennageshaa yimkam

సింగారరాయుఁడ వౌదు చెన్నకేశా యింకఁ
Language

(॥పల్లవి॥)
సింగారరాయుఁడ వౌదు చెన్నకేశా యింకఁ
జెంగకుమీ మా రతుల చెన్నకేశా

(॥సింగా॥)
చిమ్ములచుట్లతోనే చెన్నకేశా మాకు
చిమ్మిరేఁచేవు వలపు చెన్నకేశా
చెమ్మఁజెమటచెక్కుల చెన్నకేశా; మాపైఁ
జిమ్మకు గోళ్ళ నీవు చెన్నకేశా

(॥సింగా॥)
సెలవిలేనగవుల చెన్నకేశా; మాకే
సెలవనెవు వయసు చెన్న కేశా
చెలఁగి పసిడిదట్టి చెన్నకేశా; యీ-
చెలువము నీకే చెల్లె చెన్నకేశా

(॥సింగా॥)
చెప్పరానిమహిమల చెన్నకేశా మాకు
చెప్పిలేమోవి యిచ్చితి చెన్నకేశా
యిప్పుడే శ్రీవేంకటాద్రి నిందు మాచనవోలిలో
చెప్పఁగా నన్నేలితివి చెన్నకేశా

(||pallavi||)
siṁgārarāyum̐ḍa vaudu sĕnnageśhā yiṁkam̐
jĕṁgagumī mā radula sĕnnageśhā

(||siṁgā||)
simmulasuṭladone sĕnnageśhā māgu
simmirem̐sevu valabu sĕnnageśhā
sĕmmam̐jĕmaḍasĕkkula sĕnnageśhā; mābaim̐
jimmagu goḽḽa nīvu sĕnnageśhā

(||siṁgā||)
sĕlavilenagavula sĕnnageśhā; māge
sĕlavanĕvu vayasu sĕnna keśhā
sĕlam̐gi pasiḍidaṭṭi sĕnnageśhā; yī-
sĕluvamu nīge sĕllĕ sĕnnageśhā

(||siṁgā||)
sĕpparānimahimala sĕnnageśhā māgu
sĕppilemovi yichchidi sĕnnageśhā
yippuḍe śhrīveṁkaḍādri niṁdu māsanavolilo
sĕppam̐gā nannelidivi sĕnnageśhā