Simgaaraala mimchee narasimhadevumdu

సింగారాల మించీ నరసింహదేవుఁడు
Language

(॥పల్లవి॥)
సింగారాల మించీ నరసింహదేవుఁడు
చెంగటనున్నాఁడు నరసింహదేవుఁడు

(॥సింగా॥)
సురలు జయవెట్ట నసురలెల్ల మొరవెట్ట
సిరితో మెలఁగీ నరసింహదేవుఁడు
ధరణి వంపెట్ట బ్రతిధ్వనులు మిన్నులు ముట్ట
శిరసెత్తె నవి నరసింహదేవుఁడు

(॥సింగా॥)
కాంచనదైత్యుఁడు దొరకాలువనెత్తురు వార
చించెను గోళ్ళ నరసింహదేవుఁడు
పంచలఁ బంతాలు మీరి భవనాళియేరు వార
చెంచతలఁ గోరీ నరసింహదేవుఁడు

(॥సింగా॥)
బలిమి పైపైనెక్క ప్రహ్లాదుఁ డట్టె మొక్క
చిలికీఁ గరుణ నరసింహదేవుడు
అలరి శ్రీవేంకటాద్రి నహోబలముమీఁద
చెలువమే చూపీ నరసింహదేవుఁడు

(||pallavi||)
siṁgārāla miṁchī narasiṁhadevum̐ḍu
sĕṁgaḍanunnām̐ḍu narasiṁhadevum̐ḍu

(||siṁgā||)
suralu jayavĕṭṭa nasuralĕlla mŏravĕṭṭa
sirido mĕlam̐gī narasiṁhadevum̐ḍu
dharaṇi vaṁpĕṭṭa bradidhvanulu minnulu muṭṭa
śhirasĕttĕ navi narasiṁhadevum̐ḍu

(||siṁgā||)
kāṁchanadaityum̐ḍu dŏragāluvanĕtturu vāra
siṁchĕnu goḽḽa narasiṁhadevum̐ḍu
paṁchalam̐ baṁtālu mīri bhavanāḽiyeru vāra
sĕṁchadalam̐ gorī narasiṁhadevum̐ḍu

(||siṁgā||)
balimi paibainĕkka prahlādum̐ ḍaṭṭĕ mŏkka
siligīm̐ garuṇa narasiṁhadevuḍu
alari śhrīveṁkaḍādri nahobalamumīm̐da
sĕluvame sūbī narasiṁhadevum̐ḍu