చిక్కితి మీ పాలన చేయరె యీ వేళనూ
(॥పల్లవి॥)
చిక్కితి మీ పాలన చేయరె యీ వేళనూ
ఇక్కడనే వేగిరించే రేమందు నేనూ
(॥॥)
చెక్కిటిమీఁదికి చెయ్యి చిత్తములోనిది నుయ్యి
యెక్కడిబుద్దులు నాకు నేమిచెప్పేరే
ముక్కుమీఁదటిది వేలు మోహములు వేవేలు
ఇక్కువ లెఱఁగలేరు యేమందు నేను
(॥॥)
నిలువెల్లా నివ్వెరగు నిద్దుర రెప్పమరఁగు
కలిగినమీఁదటెత్తు కనుఁగొనరే
సెలవులనే నగవు చెప్పఁబోతేనే బిగువు
యెలమి మీరు మొక్కఁగ నే నేమందునే
(॥॥)
చెదరిన నీ కురులు సేసకొప్పున విరులు
తుదమొద లెఱఁగరు తొలఁగరే
యెదుట శ్రీవేంకటేశుఁ డిదే వచ్చి, నన్నుఁ గూడె-
నిదెవో మీతో నింక నేమందు నేను
(||pallavi||)
sikkidi mī pālana seyarĕ yī veḽanū
ikkaḍane vegiriṁche remaṁdu nenū
(||||)
sĕkkiḍimīm̐digi sĕyyi sittamulonidi nuyyi
yĕkkaḍibuddulu nāgu nemisĕppere
mukkumīm̐daḍidi velu mohamulu vevelu
ikkuva lĕṟam̐galeru yemaṁdu nenu
(||||)
niluvĕllā nivvĕragu niddura rĕppamaram̐gu
kaliginamīm̐daḍĕttu kanum̐gŏnare
sĕlavulane nagavu sĕppam̐bodene biguvu
yĕlami mīru mŏkkam̐ga ne nemaṁdune
(||||)
sĕdarina nī kurulu sesagŏppuna virulu
tudamŏda lĕṟam̐garu tŏlam̐gare
yĕduḍa śhrīveṁkaḍeśhum̐ ḍide vachchi, nannum̐ gūḍĕ-
nidĕvo mīdo niṁka nemaṁdu nenu