చిక్కని సింగారరాయ శ్రీవేంకటేశ నీకు
(॥పల్లవి॥)
చిక్కని సింగారరాయ శ్రీవేంకటేశ నీకు
అక్కున నున్న తరుణి యన్నియునుఁ గాదా
(॥చిక్కని॥)
యింతిచూపువెన్నెలలు యిటు నీపైఁ బోసితేనే
కాంతి నీ కదే కప్పురకాపు గాదా
పంతాన గిన్నెలతోడి పచ్చకప్పురపుధూళి
యింతయు నీమై నలఁదే విది గొంతవలెనా
(॥చిక్కని॥)
చెలిబొమ్మజంకెనల చీఁకటిపైఁ బోసితేనే
కలిమి నదే పుణుఁగుకాపు గాదా
పలు భరణులతోడిపచ్చితట్టుపుణుఁ గెల్లా
నిలువున నలఁదేవు నీకు నిది వలెనా
(॥చిక్కని॥)
వనిత మేనికాంతులు వడి నీపైఁ జిమ్మితేనే
సునిసి నీ కవే పెక్కుసొమ్ములు గావా
అనుగు శ్రీవేంకటేశ అలమేలుమంగఁ గూడి
తనియ సొమ్ము వెట్టితి తగు నిది నీక
(||pallavi||)
sikkani siṁgārarāya śhrīveṁkaḍeśha nīgu
akkuna nunna taruṇi yanniyunum̐ gādā
(||sikkani||)
yiṁtisūbuvĕnnĕlalu yiḍu nībaim̐ bosidene
kāṁti nī kade kappuragābu gādā
paṁtāna ginnĕladoḍi pachchagappurabudhūḽi
yiṁtayu nīmai nalam̐de vidi gŏṁtavalĕnā
(||sikkani||)
sĕlibŏmmajaṁkĕnala sīm̐kaḍibaim̐ bosidene
kalimi nade puṇum̐gugābu gādā
palu bharaṇuladoḍibachchidaṭṭubuṇum̐ gĕllā
niluvuna nalam̐devu nīgu nidi valĕnā
(||sikkani||)
vanida menigāṁtulu vaḍi nībaim̐ jimmidene
sunisi nī kave pĕkkusŏmmulu gāvā
anugu śhrīveṁkaḍeśha alamelumaṁgam̐ gūḍi
taniya sŏmmu vĕṭṭidi tagu nidi nīga