Siguro semga soobam jellade neegu

చిగురో చేఁగ చూపఁ జెల్లదే నీకు
Language

(॥పల్లవి॥)
చిగురో చేఁగ చూపఁ జెల్లదే నీకు
అగపడె నీ రమణుఁ డదిగో నీకు

(॥॥)
వలపులే కడుఁబెంచి వాలుకరెప్పలు వంచి
సెలవినవ్వులనేల చిందేవే సిగ్గు
నిలువునఁ దమిరేఁచి నెయ్యపుటాసలు పూఁచి
మలసి యంతలోనే మాననేలే నీకు

(॥॥)
మాటలతేనెలు చూపి మదనముద్రలు మోపి
యీటునఁ దలుపుమాటు కేల పొయ్యేవే
గీఁటుఁచుఁ గన్నుల నవ్వి కిందటిమోహలు దవ్వి
మాటికిమాటికి మేనమఱుపేలే నీకు

(॥॥)
కాఁగిటిరతికిఁ జొచ్చి కమ్మటి నీకెమ్మోవి ఇచ్చి
కాఁగినగుబ్బలనేల ఘాతసేసేవే
వీఁగుచుఁ గూడితివి శ్రీ వేంకటేశుని విఁట్టె
మూఁగినపులకల యీమో పేలే నీకు

(||pallavi||)
siguro sem̐ga sūbam̐ jĕllade nīgu
agabaḍĕ nī ramaṇum̐ ḍadigo nīgu

(||||)
valabule kaḍum̐bĕṁchi vālugarĕppalu vaṁchi
sĕlavinavvulanela siṁdeve siggu
niluvunam̐ damirem̐si nĕyyabuḍāsalu pūm̐si
malasi yaṁtalone mānanele nīgu

(||||)
māḍaladenĕlu sūbi madanamudralu mobi
yīḍunam̐ dalubumāḍu kela pŏyyeve
gīm̐ṭum̐sum̐ gannula navvi kiṁdaḍimohalu davvi
māḍigimāḍigi menamaṟubele nīgu

(||||)
kām̐giḍiradigim̐ jŏchchi kammaḍi nīgĕmmovi ichchi
kām̐ginagubbalanela ghādaseseve
vīm̐gusum̐ gūḍidivi śhrī veṁkaḍeśhuni vim̐ṭṭĕ
mūm̐ginabulagala yīmo pele nīgu