Sigguvidisinameemda selladu podu

సిగ్గువిడిచినమీఁద చెల్లదు పోదు
Language

(॥పల్లవి॥)
సిగ్గువిడిచినమీఁద చెల్లదు పోదు
యెగ్గుగాదు తనకుఁ జెయ్యెత్తి మొక్కే ననెరే

(॥సిగ్గు॥)
వలపు వెగ్గళమైతే వాదించఁ బనిలేదు
చలమెప్పుడైతే వంచన చెల్లదు
కెలయఁ జొచ్చితే మరి కిందుమీదు లెంచరాదు
తలఁచుకొమ్మనవే యీ తగవు లాతనిని

(॥సిగ్గు॥)
ననుపు లొనగూడితే నమ్మిక లడుగవద్దు
మనసు రాకుంటేను మాటలేఁటికి
పెనఁగు లాడఁబోఁతే ప్రియములు చవిగావు
కనుఁగొనమనరే యీ గతులు తా నెరుఁగు

(॥సిగ్గు॥)
చుట్టరికమెనసితే చెప్పులెత్త మరియేల
వెట్టి నవ్వునవ్వితేను వేడుకేడది
ఇట్టె శ్రీ వేంకటేశుఁడేలినాఁడు నన్ను నేఁడు
గుట్టుతో నుండుమనవే గుణమెల్లాఁగంటిని

(||pallavi||)
sigguviḍisinamīm̐da sĕlladu podu
yĕggugādu tanagum̐ jĕyyĕtti mŏkke nanĕre

(||siggu||)
valabu vĕggaḽamaide vādiṁcham̐ baniledu
salamĕppuḍaide vaṁchana sĕlladu
kĕlayam̐ jŏchchide mari kiṁdumīdu lĕṁcharādu
talam̐sugŏmmanave yī tagavu lādanini

(||siggu||)
nanubu lŏnagūḍide nammiga laḍugavaddu
manasu rāguṁṭenu māḍalem̐ṭigi
pĕnam̐gu lāḍam̐bom̐te priyamulu savigāvu
kanum̐gŏnamanare yī gadulu tā nĕrum̐gu

(||siggu||)
suṭṭarigamĕnaside sĕppulĕtta mariyela
vĕṭṭi navvunavvidenu veḍugeḍadi
iṭṭĕ śhrī veṁkaḍeśhum̐ḍelinām̐ḍu nannu nem̐ḍu
guṭṭudo nuṁḍumanave guṇamĕllām̐gaṁṭini