సిగ్గువడుదురా చెవుల వినేమిదె
(॥పల్లవి॥)
సిగ్గువడుదురా చెవుల వినేమిదె
బగ్గన నూరక పలుకవయ్యా
(॥సిగ్గు॥)
కలికి నీతోనిదె కతలు చెప్పఁగా
కొలకొలమని వూఁకొనరాదా
తొలఁకి నీ సుద్దులు తొరలివచ్చెనో
సెలవుల నవ్వేవు చెప్పవయ్యా
(॥సిగ్గు॥)
తరుణి మరియు నదె తగవులు చెప్పఁగ
సరసతతో మెచ్చఁగరాదా
సొరిది నీపైనవి సోఁకి వచ్చెనో
యెరపరమేలానతియ్యవయ్యా
(॥సిగ్గు॥)
సతి నీకు నిదే చదువులు చెప్పఁగ
మతి నేర్చుక యలమఁగరాదా
యితవుగ శ్రీవేంకటేశ కూడితివి
మతకము నిదో మాఁటాడవయ్యా
(||pallavi||)
sigguvaḍudurā sĕvula vinemidĕ
baggana nūraga palugavayyā
(||siggu||)
kaligi nīdonidĕ kadalu sĕppam̐gā
kŏlagŏlamani vūm̐kŏnarādā
tŏlam̐ki nī suddulu tŏralivachchĕno
sĕlavula navvevu sĕppavayyā
(||siggu||)
taruṇi mariyu nadĕ tagavulu sĕppam̐ga
sarasadado mĕchcham̐garādā
sŏridi nībainavi som̐ki vachchĕno
yĕrabaramelānadiyyavayyā
(||siggu||)
sadi nīgu nide saduvulu sĕppam̐ga
madi nersuga yalamam̐garādā
yidavuga śhrīveṁkaḍeśha kūḍidivi
madagamu nido mām̐ṭāḍavayyā