Sigguvadi yimdaamkaa seluvumdu nannu doore

సిగ్గువడి యిందాఁకా చెలువుఁడు నన్ను దూరె
Language

(॥పల్లవి॥)
సిగ్గువడి యిందాఁకా చెలువుఁడు నన్ను దూరె
బగ్గన మమ్మింతేసి పచ్చిసేతురా

(॥సిగ్గు॥)
అలవోకగా నీతో నాడుకొన్నమాటలెల్ల
వెలయఁగ నాతనితో విన్నవింతురా
చెలివంటా నాతనిచేఁత లిటువంటివంటే
చలపట్టి యంతలోనే సాదింతురా

(॥సిగ్గు॥)
నగుతా నాతనిరచనలు నే సందేహించితే
సొగసి యాతనిమేను సోదింతురా
పగటున నావేళ పంతాలు నే మెరసితే
తగవు విడిచి మీరు తమకింతురా

(॥సిగ్గు॥)
వద్దనుండి నే నాతనివలపులు వొగడితే
కొద్దిమీరి వెంగెములు కొనవేతురా
వొద్దికై శ్రీవేంకటేశుఁ డున్నతి నన్నుఁ గూడె
సుద్దులు తొల్లితి వింతే సూడువట్టుదురా

(||pallavi||)
sigguvaḍi yiṁdām̐kā sĕluvum̐ḍu nannu dūrĕ
baggana mammiṁtesi pachchisedurā

(||siggu||)
alavogagā nīdo nāḍugŏnnamāḍalĕlla
vĕlayam̐ga nādanido vinnaviṁturā
sĕlivaṁṭā nādanisem̐ta liḍuvaṁṭivaṁṭe
salabaṭṭi yaṁtalone sādiṁturā

(||siggu||)
nagudā nādanirasanalu ne saṁdehiṁchide
sŏgasi yādanimenu sodiṁturā
pagaḍuna nāveḽa paṁtālu ne mĕraside
tagavu viḍisi mīru tamagiṁturā

(||siggu||)
vaddanuṁḍi ne nādanivalabulu vŏgaḍide
kŏddimīri vĕṁgĕmulu kŏnavedurā
vŏddigai śhrīveṁkaḍeśhum̐ ḍunnadi nannum̐ gūḍĕ
suddulu tŏllidi viṁte sūḍuvaṭṭudurā