Sigguvadi moola nemisesevu neevu

సిగ్గువడి మూల నేమిసేసేవు నీవు
Language

(॥పల్లవి॥)
సిగ్గువడి మూల నేమిసేసేవు నీవు
అగ్గమైన నాయకుని అండకు రాఁగదవే

(॥సిగ్గు॥)
తలపోసి తలపోసి తమకించి నిన్నుఁ బిల్చు
చెలి వూడిగముదని చింతింపఁడు
చిలుకవలికితే నీయెలుగంటా మాటాడు
వలచిన రమణునివద్దికి రాఁగదవే

(॥సిగ్గు॥)
వుమ్మడి నీనిట్టూర్పని వూరకే దిక్కులు చూచు
యిమ్ములఁ జల్లగాలెని యెరఁగఁడు
నెమ్మి వెన్నెలగాయఁగ నీనవ్వని తానూ నవ్వీ
రమ్మనవలెనా పతి రతికి రాఁగదవే

(॥సిగ్గు॥)
పదరుచు లేచి నీపంజని యెదురేఁగు
ఉదయచందురుఁడని వూహించఁడు
యిదివో శ్రీవేంకటేశుఁ డింత సేసి నిన్నుఁ గూడె
యెద వెట్టుకోవలెనా యెప్పుడు రాఁగదవే

(||pallavi||)
sigguvaḍi mūla nemisesevu nīvu
aggamaina nāyaguni aṁḍagu rām̐gadave

(||siggu||)
talabosi talabosi tamagiṁchi ninnum̐ bilsu
sĕli vūḍigamudani siṁtiṁpam̐ḍu
silugavaligide nīyĕlugaṁṭā māḍāḍu
valasina ramaṇunivaddigi rām̐gadave

(||siggu||)
vummaḍi nīniṭṭūrbani vūrage dikkulu sūsu
yimmulam̐ jallagālĕni yĕram̐gam̐ḍu
nĕmmi vĕnnĕlagāyam̐ga nīnavvani tānū navvī
rammanavalĕnā padi radigi rām̐gadave

(||siggu||)
padarusu lesi nībaṁjani yĕdurem̐gu
udayasaṁdurum̐ḍani vūhiṁcham̐ḍu
yidivo śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi ninnum̐ gūḍĕ
yĕda vĕṭṭugovalĕnā yĕppuḍu rām̐gadave