సిగ్గువడీ సుమ్మీ చిన్నవయసుది
(॥పల్లవి॥)
సిగ్గువడీ సుమ్మీ చిన్నవయసుది
వొగ్గి సారె నెంత వొరసేవయ్యా
(॥సిగ్గు॥)
వలచి యేపొద్దు వద్దనున్నదంటా
చెలినేల కాకు సేసేవయ్యా
చెలిమి సేయఁగా చెమరించెనంటా
నలిరేఁగి యేమి నవ్వేవయ్యా
(॥సిగ్గు॥)
కనుఁగొని మతి గరఁగెనంటాను
చెనకేల గోరఁ జిమ్మేవయ్యా
వినయాన నిన్ను వేఁడుకొనెనంటా
గునిసి యేమాడుకొనేవయ్యా
(॥సిగ్గు॥)
కందువల నిన్నుఁ గాలు దొక్కెనంటా
చెంది యేమి సన్నసేసేవయ్యా
యిందుకె శ్రీవేంకటేశ కూడితివి
అంది మర్మమేల అంటేవయ్యా
(||pallavi||)
sigguvaḍī summī sinnavayasudi
vŏggi sārĕ nĕṁta vŏrasevayyā
(||siggu||)
valasi yebŏddu vaddanunnadaṁṭā
sĕlinela kāgu sesevayyā
sĕlimi seyam̐gā sĕmariṁchĕnaṁṭā
nalirem̐gi yemi navvevayyā
(||siggu||)
kanum̐gŏni madi garam̐gĕnaṁṭānu
sĕnagela goram̐ jimmevayyā
vinayāna ninnu vem̐ḍugŏnĕnaṁṭā
gunisi yemāḍugŏnevayyā
(||siggu||)
kaṁduvala ninnum̐ gālu dŏkkĕnaṁṭā
sĕṁdi yemi sannasesevayyā
yiṁdugĕ śhrīveṁkaḍeśha kūḍidivi
aṁdi marmamela aṁṭevayyā