Sigguvadam didivo selulaala

సిగ్గువడఁ డిదివో చెలులాల
Language

(॥పల్లవి॥)
సిగ్గువడఁ డిదివో చెలులాల
వెగ్గలపు సంతోసాన విఱ్ఱవీఁగీని

(॥సిగ్గు॥)
వాఁడివో గోవిందరాజు వలపులు చల్లుతాను
పోఁడిమితోఁ బవ్వళించి భోగించీని
కోఁడి కోఁడి చూపులను కొమ్మలు చూడఁగాను
నాఁడు నేఁడు వొక్కరీతి నవ్వు నవ్వీని

(॥సిగ్గు॥)
సంకుఁ జక్రములతోడ చంద్రగాని రెంటెముతో
కంకణముల చాఁచిన కరములతో
వుంకువ కానికలు వువిదలియ్యఁగాను
సంకెలేక మోవితేనె చవి చూపీని

(॥సిగ్గు॥)
బంగారు కటారమదే పానుపు శేషుఁడు వాఁడే
సింగారపు వేడుకలఁ జెలఁగీ నదే
చెంగటఁ బెండ్లాడుతాను శ్రీవేంకటేశుఁడు దానే
వుంగరపు వేలుచూపి వొద్దికయ్యీని

(||pallavi||)
sigguvaḍam̐ ḍidivo sĕlulāla
vĕggalabu saṁtosāna viṭravīm̐gīni

(||siggu||)
vām̐ḍivo goviṁdarāju valabulu salludānu
pom̐ḍimidom̐ bavvaḽiṁchi bhogiṁchīni
kom̐ḍi kom̐ḍi sūbulanu kŏmmalu sūḍam̐gānu
nām̐ḍu nem̐ḍu vŏkkarīdi navvu navvīni

(||siggu||)
saṁkum̐ jakramuladoḍa saṁdragāni rĕṁṭĕmudo
kaṁkaṇamula sām̐sina karamulado
vuṁkuva kānigalu vuvidaliyyam̐gānu
saṁkĕlega movidenĕ savi sūbīni

(||siggu||)
baṁgāru kaḍāramade pānubu śheṣhum̐ḍu vām̐ḍe
siṁgārabu veḍugalam̐ jĕlam̐gī nade
sĕṁgaḍam̐ bĕṁḍlāḍudānu śhrīveṁkaḍeśhum̐ḍu dāne
vuṁgarabu velusūbi vŏddigayyīni