Sigguvadam bodenu simtalekkeeni

సిగ్గువడఁ బోతేను చింతలెక్కీని
Language

(॥పల్లవి॥)
సిగ్గువడఁ బోతేను చింతలెక్కీని
వెగ్గళించితే వెన్నెల వేఁడులయ్యీని

(॥సిగ్గు॥)
చెలువవు నీమోము చెక్కిటనేల మోపేవే
వలపు వెసురు(?) దాఁకి వాడఁబారీని
నిలువునఁ దలవంచి నేలలేల వ్రాసేవే
చలివాసి మదనుఁడు చదివించీని

(॥సిగ్గు॥)
మూలనున్న నిట్టూర్పు ముంగిటనేల వేసేవే
గాలిగొట్టై యధరము గరివడీని
జాలిఁబడ్డ చెమటల సరితెప్పలేలెక్కేవే
వేళతోనే చల్లగాలి వేఁటలాడీని

(॥సిగ్గు॥)
నంటు మీఱి నెలవుల నవ్వులేల వుమిసేవే
గెంటు లేని కన్నులను కెంపులెక్కీని
యింటిలోనే శ్రీ వేంకటేశుఁడఁ గూడితి నేను
పంటలై పులకపైరు పాలలెక్కీని

(||pallavi||)
sigguvaḍam̐ bodenu siṁtalĕkkīni
vĕggaḽiṁchide vĕnnĕla vem̐ḍulayyīni

(||siggu||)
sĕluvavu nīmomu sĕkkiḍanela mobeve
valabu vĕsuru(?) dām̐ki vāḍam̐bārīni
niluvunam̐ dalavaṁchi nelalela vrāseve
salivāsi madanum̐ḍu sadiviṁchīni

(||siggu||)
mūlanunna niṭṭūrbu muṁgiḍanela veseve
gāligŏṭṭai yadharamu garivaḍīni
jālim̐baḍḍa sĕmaḍala saridĕppalelĕkkeve
veḽadone sallagāli vem̐ṭalāḍīni

(||siggu||)
naṁṭu mīṟi nĕlavula navvulela vumiseve
gĕṁṭu leni kannulanu kĕṁpulĕkkīni
yiṁṭilone śhrī veṁkaḍeśhum̐ḍam̐ gūḍidi nenu
paṁṭalai pulagabairu pālalĕkkīni