సిగ్గువడకు మిఁక చెలియకు వలపులు
(॥పల్లవి॥)
సిగ్గువడకు మిఁక చెలియకు వలపులు
అగ్గల మయ్యను ఆదరించవయ్యా
(॥సిగ్గు॥)
తమకము మదిలోఁ దడఁబడఁగా
సముకంబున నిను జరయుచును
చెమటలు చెకులఁ జిందగఁను
తమలఁ బడిగీ దయసేయవయ్యా
(॥సిగ్గు॥)
పులకలు మేనను పొదలఁగను
పలుకుల నిను నొడఁబరచుచును
నిలువున వెరగులు నిండఁగను
మలసీ రతులకు మన్నించవయ్యా
(॥సిగ్గు॥)
వేడుకతో నూర్పులు విసరఁగను
కూడీ నీకె నినుఁ గొరుచును
యీడనె శ్రీ వేంకటేశు యేలితివి
జాబతో సరసమాడీఁజనవియ్యవయ్యా
(||pallavi||)
sigguvaḍagu mim̐ka sĕliyagu valabulu
aggala mayyanu ādariṁchavayyā
(||siggu||)
tamagamu madilom̐ daḍam̐baḍam̐gā
samugaṁbuna ninu jarayusunu
sĕmaḍalu sĕgulam̐ jiṁdagam̐nu
tamalam̐ baḍigī dayaseyavayyā
(||siggu||)
pulagalu menanu pŏdalam̐ganu
palugula ninu nŏḍam̐barasusunu
niluvuna vĕragulu niṁḍam̐ganu
malasī radulagu manniṁchavayyā
(||siggu||)
veḍugado nūrbulu visaram̐ganu
kūḍī nīgĕ ninum̐ gŏrusunu
yīḍanĕ śhrī veṁkaḍeśhu yelidivi
jābado sarasamāḍīm̐janaviyyavayyā