సిగ్గువడ వెఁ(వెం?)తైనా చెల్లఁబో నీవు
(॥పల్లవి॥)
సిగ్గువడ వెఁ(వెం?)తైనా చెల్లఁబో నీవు
బగ్గన మమ్ము నవ్వుఁబాటు సేసేవు
(॥సిగ్గు॥)
చాయలకు నీవు నాతో సరసములాడఁగాను
మోయుచు సవతులు మోములుచూచుకొనేరు
యీయెడ మంచముమీఁద నిద్దరముఁ గూచుండఁగా
నాయములు వెట్టుక సన్నలుసేసుకొనేరు
(॥సిగ్గు॥)
కాతరాన నీవు నాకు గందపుబొట్టు వెట్టఁగా
జాతులు సేసేరు వారె సారెసారెఁ జెలులు
చేతిసురటిని నీవు చేరి నాకు విసరఁగ
రాతిరిఁబగలును కేరడములాడేరు
(॥సిగ్గు॥)
కందువల నీవు నన్నుఁ గాఁగిలించి కూడఁగాన
అందరుఁ దమతమకే ఆసపడి రిపుడు
పొందినశ్రీవేంకటేశ భోగములెల్లా సరి
మందలించి నా కెక్కుడుమన్నన లనేరు
(||pallavi||)
sigguvaḍa vĕm̐(vĕṁ?)tainā sĕllam̐bo nīvu
baggana mammu navvum̐bāḍu sesevu
(||siggu||)
sāyalagu nīvu nādo sarasamulāḍam̐gānu
moyusu savadulu momulusūsugŏneru
yīyĕḍa maṁchamumīm̐da niddaramum̐ gūsuṁḍam̐gā
nāyamulu vĕṭṭuga sannalusesugŏneru
(||siggu||)
kādarāna nīvu nāgu gaṁdabubŏṭṭu vĕṭṭam̐gā
jādulu seseru vārĕ sārĕsārĕm̐ jĕlulu
sedisuraḍini nīvu seri nāgu visaram̐ga
rādirim̐bagalunu keraḍamulāḍeru
(||siggu||)
kaṁduvala nīvu nannum̐ gām̐giliṁchi kūḍam̐gāna
aṁdarum̐ damadamage āsabaḍi ribuḍu
pŏṁdinaśhrīveṁkaḍeśha bhogamulĕllā sari
maṁdaliṁchi nā kĕkkuḍumannana laneru