సిగ్గువడ నిఁకనేల శిరసు వంచఁగనేల
(॥పల్లవి॥)
సిగ్గువడ నిఁకనేల శిరసు వంచఁగనేల
తగ్గులేని సరసాల తమి రేఁచరాదా
(॥॥)
పలుమారు నీచేఁతలు పచ్చిగా నాడఁగరాక
చెలియ చెక్కిటిమీఁదిచేత నున్నది
మొలకచన్నులమీఁద మొనగోర సోఁకింపించి
సెలవుల నవ్వింపించి చెంగలించరాదా
(॥॥)
కొచ్చి కొచ్చి నేమేన గురుతులు చూపలేక
ముచ్చెటతో సారె నీకు మొక్కుచున్నది
కచ్చుపెట్టి యాపెను నీకాఁగిటను బిగియించి
ఇచ్చకపు వలపుల నీఁదింపించరాదా
(॥॥)
రతికెక్కినట్టినిన్ను రవ్వసేయఁ జాలక
మితిమీరి నిన్నుఁ గూడి మెచ్చుచున్నది
సతమై శ్రీ వేంకటేశ చనవిచ్చి మన్నించి
యితవుగా మోవి ఇచ్చి ఇటు మెప్పించరాదా
(||pallavi||)
sigguvaḍa nim̐kanela śhirasu vaṁcham̐ganela
tagguleni sarasāla tami rem̐sarādā
(||||)
palumāru nīsem̐talu pachchigā nāḍam̐garāga
sĕliya sĕkkiḍimīm̐diseda nunnadi
mŏlagasannulamīm̐da mŏnagora som̐kiṁpiṁchi
sĕlavula navviṁpiṁchi sĕṁgaliṁcharādā
(||||)
kŏchchi kŏchchi nemena gurudulu sūbalega
muchchĕḍado sārĕ nīgu mŏkkusunnadi
kachchubĕṭṭi yābĕnu nīgām̐giḍanu bigiyiṁchi
ichchagabu valabula nīm̐diṁpiṁcharādā
(||||)
radigĕkkinaṭṭininnu ravvaseyam̐ jālaga
midimīri ninnum̐ gūḍi mĕchchusunnadi
sadamai śhrī veṁkaḍeśha sanavichchi manniṁchi
yidavugā movi ichchi iḍu mĕppiṁcharādā