Sigguvada nimkanela sepparaadaa

సిగ్గువడ నిఁకనేల చెప్పరాదా
Language

(॥పల్లవి॥)
సిగ్గువడ నిఁకనేల చెప్పరాదా
వెగ్గళించ(చె?) నీ వలపు విభుఁడు నీకెవ్వఁడే

(॥సిగ్గు॥)
ప్రేమమున వేగుదాఁకా పిప్పి సేసినట్టిమోవి
కామతంత్రముల చొక్కుకన్నుల కావి
మోములోఁ గళలు దేరెమోనముతో వసివాడు
యేమే నీకెక్కడిదే యెవ్వఁడు భోగించెనే

(॥సిగ్గు॥)
ననల విరులకొప్పు నలఁగిన జోకలు
చనుఁగవ మీఁదటి శశిరేకలు
పెనఁగిన రతికేళి పెంజెమటజారులు
పెనగొని యెక్కడివే ప్రియుఁడు నీకెవ్వఁడే

(॥సిగ్గు॥)
మేర మీరె ముక్కునను మిక్కిలి నిటూరుపులు
తేరెను మేఁదీఁగె కొత్తతీరుపులు
యీరీతి నిన్ను శ్రీవేంకటేశుఁడు గూడెననేవు
కారణమెట్టు గలిగె ఘనుఁడితఁడెవ్వఁడే

(||pallavi||)
sigguvaḍa nim̐kanela sĕpparādā
vĕggaḽiṁcha(sĕ?) nī valabu vibhum̐ḍu nīgĕvvam̐ḍe

(||siggu||)
premamuna vegudām̐kā pippi sesinaṭṭimovi
kāmadaṁtramula sŏkkugannula kāvi
momulom̐ gaḽalu derĕmonamudo vasivāḍu
yeme nīgĕkkaḍide yĕvvam̐ḍu bhogiṁchĕne

(||siggu||)
nanala virulagŏppu nalam̐gina jogalu
sanum̐gava mīm̐daḍi śhaśhiregalu
pĕnam̐gina radigeḽi pĕṁjĕmaḍajārulu
pĕnagŏni yĕkkaḍive priyum̐ḍu nīgĕvvam̐ḍe

(||siggu||)
mera mīrĕ mukkunanu mikkili niḍūrubulu
terĕnu mem̐dīm̐gĕ kŏttadīrubulu
yīrīdi ninnu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnanevu
kāraṇamĕṭṭu galigĕ ghanum̐ḍidam̐ḍĕvvam̐ḍe