సిగ్గువడ నించుకంతా చెలరేఁగేవు నీవైతే
(॥పల్లవి॥)
సిగ్గువడ నించుకంతా చెలరేఁగేవు నీవైతే
యెగ్గులుపట్టేవారెల్లా నేమందురో
(॥సిగ్గు॥)
ఇంతి నీవు నందలాన యెదురుబడి నెక్కి
వింతలుగా నేఁగేవు వీదివీదులు
కంతలసోరణగండ్ల కడమవారెల్లాఁ జూచి
యెంతేసియీసులతోడ నేమందురో
(॥సిగ్గు॥)
సరిగా గుఱ్ఱముమీఁద సతియు నీవును నెక్కి
వరుసలను నేఁగేరు వాడవాడల
విరతిలో మేడలెక్కి నీసతులెల్లాఁ జూచి
చెరపులకాఁతాళాన నేమందురో
(॥సిగ్గు॥)
అలమేలుమంగఁ గూడి అట్టె పల్లకిమీఁద
చెలరేఁగి యేఁగేవు శ్రీవేంకటేశ
కొలిచివచ్చేటినీకొమ్మలెల్లా నట్టె చూచి
యెలమి వేడుకవుట్టి యేమందురో
(||pallavi||)
sigguvaḍa niṁchugaṁtā sĕlarem̐gevu nīvaide
yĕggulubaṭṭevārĕllā nemaṁduro
(||siggu||)
iṁti nīvu naṁdalāna yĕdurubaḍi nĕkki
viṁtalugā nem̐gevu vīdivīdulu
kaṁtalasoraṇagaṁḍla kaḍamavārĕllām̐ jūsi
yĕṁtesiyīsuladoḍa nemaṁduro
(||siggu||)
sarigā guṭramumīm̐da sadiyu nīvunu nĕkki
varusalanu nem̐geru vāḍavāḍala
viradilo meḍalĕkki nīsadulĕllām̐ jūsi
sĕrabulagām̐tāḽāna nemaṁduro
(||siggu||)
alamelumaṁgam̐ gūḍi aṭṭĕ pallagimīm̐da
sĕlarem̐gi yem̐gevu śhrīveṁkaḍeśha
kŏlisivachcheḍinīgŏmmalĕllā naṭṭĕ sūsi
yĕlami veḍugavuṭṭi yemaṁduro