సిగ్గువడ కింకానేల చెలువునిఁ దడవీని
(॥పల్లవి॥)
సిగ్గువడ కింకానేల చెలువునిఁ దడవీని
దగ్గరి పైకొనీ బేలుఁదనము గాదా
(॥సిగ్గు॥)
చేసుకొన్న రమణుఁడు చేతికి లోఁగాకుండితే
వేసరించి కొరేది వీరిడి గాదా
ఆసలు చూపినవాఁడు అవ్వలి పరాకైతే
యీసడించక నవ్వేది యెడ్డతనము గాదా
(॥సిగ్గు॥)
కోరి తెచ్చుకొన్న వాఁడే కుశిగుంపు సేసితేను
కూరిమికిఁ బెనఁగేది కూళగాదా
మేరతో నవ్వనివాఁడే మించి పొందు సేసితేను
మోరతోపున దూరేది మొక్కలముగాదా
(॥సిగ్గు॥)
శ్రీవేంకటేశుఁడే చెనకక వుండితేను
కావిరిఁ గాఁగి లించేది గయ్యాళిగాదా
ఆవిభుఁడె నన్ను నేలె నలమేల్మంగను నేను
భావించెప్పటిఁ జూచేది బయకారముగాదా
(||pallavi||)
sigguvaḍa kiṁkānela sĕluvunim̐ daḍavīni
daggari paigŏnī belum̐danamu gādā
(||siggu||)
sesugŏnna ramaṇum̐ḍu sedigi lom̐gāguṁḍide
vesariṁchi kŏredi vīriḍi gādā
āsalu sūbinavām̐ḍu avvali parāgaide
yīsaḍiṁchaga navvedi yĕḍḍadanamu gādā
(||siggu||)
kori tĕchchugŏnna vām̐ḍe kuśhiguṁpu sesidenu
kūrimigim̐ bĕnam̐gedi kūḽagādā
merado navvanivām̐ḍe miṁchi pŏṁdu sesidenu
moradobuna dūredi mŏkkalamugādā
(||siggu||)
śhrīveṁkaḍeśhum̐ḍe sĕnagaka vuṁḍidenu
kāvirim̐ gām̐gi liṁchedi gayyāḽigādā
āvibhum̐ḍĕ nannu nelĕ nalamelmaṁganu nenu
bhāviṁchĕppaḍim̐ jūsedi bayagāramugādā