Sigguvada kimka nela seppavayyaa

సిగ్గువడ కిఁక నేల చెప్పవయ్యా
Language

(॥పల్లవి॥)
సిగ్గువడ కిఁక నేల చెప్పవయ్యా
తగ్గుముగ్గు లేక నీ తలఁపు లీడేరెనా

(॥॥)
కాంతమోము చెమరించెఁ గళలు మోమున నిండె
మంతనాన నాపె నేఁడు మన్నించితివా
పంతములాడుదువు బాసలిత్తువు మాకైతే
వంతుల నీవూ నాపెవలకు లోనైతివా

(॥॥)
సెలవుల నవ్వుదేరె చిగిరించెఁ బులకలు
కలికి చేసినసేవ గైకొంటివా
వలవ నెందూ నందువు వసమైతి నాకందువు
బలిమి నాపెకు నేఁడు బ్రమసితివా

(॥॥)
మోవిపైఁ గెంపులు రేఁగె ముదము లన్నిటా మించె
యీవల నాపెను నన్ను నేలితివా
భావించి శ్రీవేంకటేశ పలుయెమ్మె లాడుదువు
చేవల్ల మాయిద్దరికీఁ జిక్కితివా

(||pallavi||)
sigguvaḍa kim̐ka nela sĕppavayyā
taggumuggu lega nī talam̐pu līḍerĕnā

(||||)
kāṁtamomu sĕmariṁchĕm̐ gaḽalu momuna niṁḍĕ
maṁtanāna nābĕ nem̐ḍu manniṁchidivā
paṁtamulāḍuduvu bāsalittuvu māgaide
vaṁtula nīvū nābĕvalagu lonaidivā

(||||)
sĕlavula navvuderĕ sigiriṁchĕm̐ bulagalu
kaligi sesinaseva gaigŏṁṭivā
valava nĕṁdū naṁduvu vasamaidi nāgaṁduvu
balimi nābĕgu nem̐ḍu bramasidivā

(||||)
movibaim̐ gĕṁpulu rem̐gĕ mudamu lanniḍā miṁchĕ
yīvala nābĕnu nannu nelidivā
bhāviṁchi śhrīveṁkaḍeśha paluyĕmmĕ lāḍuduvu
sevalla māyiddarigīm̐ jikkidivā