సిగ్గువడ కప్పటిని చెయివట్టే వాతని
(॥పల్లవి॥)
సిగ్గువడ కప్పటిని చెయివట్టే వాతని
అగ్గలమై కాలుదొక్కే వౌనే లెస్సాయనే
(॥సిగ్గు॥)
నీకొలఁదివారలా నెయ్యపుఁజనవరులు
చేకొ నాతనిఁ జేఁతలు సేసిరి తొల్లి
సాకిరయై నే నుండఁగా సంగడిఁ గూచుండవచ్చేఁ
వీకడ నీతనికి నీ వేనాఁటిదానవే
(॥సిగ్గు॥)
యీపాటిదొరతనమా యిన్నాళ్ళు నాతనివద్ద
నాపతి యనుచుఁ బైపై నవ్వినవారు
యేపున నే మిద్దరమూ నేకతాన నుండఁగాను
పైపైఁ బిలిచేవు నీబలు వేఁటిబలువే
(॥సిగ్గు॥)
యింత నేరకుండిరా యిన్నాళ్లవా రితని
పంతాన చేతులు చాఁచి భ్రమయించును
అంతటా శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
వంతుకు లాసేపు యిఁక వద్దు వద్దు రాకువే
(||pallavi||)
sigguvaḍa kappaḍini sĕyivaṭṭe vādani
aggalamai kāludŏkke vaune lĕssāyane
(||siggu||)
nīgŏlam̐divāralā nĕyyabum̐janavarulu
segŏ nādanim̐ jem̐talu sesiri tŏlli
sāgirayai ne nuṁḍam̐gā saṁgaḍim̐ gūsuṁḍavachchem̐
vīgaḍa nīdanigi nī venām̐ṭidānave
(||siggu||)
yībāḍidŏradanamā yinnāḽḽu nādanivadda
nābadi yanusum̐ baibai navvinavāru
yebuna ne middaramū negadāna nuṁḍam̐gānu
paibaim̐ bilisevu nībalu vem̐ṭibaluve
(||siggu||)
yiṁta neraguṁḍirā yinnāḽlavā ridani
paṁtāna sedulu sām̐si bhramayiṁchunu
aṁtaḍā śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
vaṁtugu lāsebu yim̐ka vaddu vaddu rāguve